గొంతు నొప్పితో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి...

kalpana
 సీజన్ మారినప్పుడల్లా నొప్పి వస్తూ ఉంటుంది. ఈ బాధను భరించడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ నొప్పి వల్ల ఏమీ తోచక ఏమి చేయాలో తెలియక బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు మన వంటింట్లో దొరికే వాటితోనే గొంతునొప్పిని తగ్గించు కోవచ్చు. వాటిని ఎలా వాడాలి. వాటి నుంచి కలిగే ప్రయోజనాలు ఏమిటి? వాటి గురించి వివరంగా తెలుసుకుందాం...

 గొంతు నొప్పితో బాధపడుతున్న వాళ్లు మన వంటింట్లో ఉండే వాటితో ను టీ తయారు చేసుకొని తాగడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. టీ తయారు చేయడానికి లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం వంటివాటితో టీ చేసుకుని తాగడం వల్ల గొంతు నొప్పి త్వరగా తగ్గుతుంది.

 గొంతు నొప్పితో బాధపడే వాళ్ళు అల్లంతో టీ తయారు చేసుకొని తాగడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. కొద్దిగా అల్లం తీసుకొని వేడి నీటిలో వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత వడగట్టి తాగుతూ ఉండడంవల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.

 జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి ఉన్నప్పుడు మిరియాలతో చేసిన రసం తాగడం వల్ల వీటి నుండి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా మిరియాలను పాలలో వేసి మరగించి చల్లారిన తర్వాత తాగడం వల్ల కూడా గొంతు నొప్పి తగ్గుతుంది.

 వేడి వేడిగా చికెన్ సూప్ చేసుకొని తాగడం వల్ల గొంతు నొప్పి, ఇంకా ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి. చికెన్ సూప్ ఇన్ఫెక్షన్లకు మంచి ఔషధంలా పనిచేస్తుంది.

 నిమ్మరసంలో యాంటీబయటిక్, యాంటీ వైరల్ ఎక్కువగా ఉంటాయి.  కాబట్టి ఒక గ్లాసు గోరువెచ్చని  నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకొని తాగడం వల్ల గొంతు నొప్పి, జలుబు, తగ్గడమే కాకుండా,  ఇన్ఫెక్షన్లను కూడా దూరం చేస్తుందిగోరు వెచ్చగా ఉండే ద్రవ పదార్థాలు తరుచుగా తీసుకోవాలి. టీ, కాఫీ, లెమన్ టీ, సూప్ లు వంటివి గరమ్ గరమ్ గా గొంతులో దిగుతుంటే హాయిగా ఉండడమే కాదు, గొంతు నొప్పి నుంచి కూడా కాస్త ఉపశమనంగా ఉంటుంది. నారింజ రసంలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: