గొంతు నొప్పికి కారణాలు..పరిష్కారాలు..!

MADDIBOINA AJAY KUMAR
సీజన్ మారినా..వేరే ప్రాంతాల్లో నీరు తాగినా సాధారణంగా కనిపించే సమస్య గొంతునొప్పి. గొంతు నొప్పి అనేది సాధారణంగా కొన్ని వైరస్ లు బ్యాక్తీరియా ల వల్ల వస్తుంది. మింగాలంటే ఇబ్బందిగా ఉండటం..గొంతులో నస ల్..సోర్ త్రోట్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఈ సమస్య ఫ్లూ లేదా ఇన్ ఫ్లూయంజా లాంటి వైరస్ సంబంధ కారణాల వల్ల వస్తుంది. అంతే కాకుండా గొంతు నొప్పి తో పాటు జలుబు, శ్వాస లో ఇబ్బంది కలగటం గొంతు ఆరినట్టు అనిపించడం సాధారణంగా కనిపించే లక్షణాలు. ఇది సీజన్ మార్పు చెందినప్పుడు వచ్చే సమస్య కాబట్టి ఆ సమయంలో ధూమపానం, కూల్ డ్రింక్స్, కెఫిన్ పానీయాలు, వేయించిన ఆహారాలు తీసుకోవడం, జిడ్డుగల ఆహారాలు తీలుకోవడం మనేయాలి. అప్పుడే వండిన ఆహారాన్ని తినాలి.

గొంతు నొప్పి వచ్చినప్పుడు ఈ వంటింటి చిట్కాలు పాటించాలి

ఉప్పు నీటిని పుక్కిలించడం గొంతు నొప్పి మరియు ఇన్ఫెక్షన్ తగ్గుతాయి. గొంతునొప్పి తగ్గటానికి ఇది ఉత్తమమైన మార్గం. దాల్చిన చెక్క అల్లం టీ వంటివి తక్షణ ఉపశమనం ఇస్తాయి. తేలికపాటి చికెన్ సూప్ కొద్ది పాటి రోగనిరోధక లక్షణాలు కలిగి వైరస్ ను చంపేస్తుంది. కాబట్టి చికెన్ సూప్ తీసుకోవడం మంచింది. అంతే కాకుండా యాపిల్ ను ఆవిరి చేసి దాన్ని తేనెతో కలిపి తినొచ్చు దాంతో గొంతునొప్పికి ఉపశమనం కలుగుతుంది. గుడ్డు లేదా తెల్ల సొన గొంతు నొప్పిని తగ్గిస్తుంది... సులభంగా జీర్ణం కూడా అవుతుంది. పసుపు పాలు తాగటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా గొంతు నొప్పి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఆవిరి పేల్చుకోవడం వల్ల నాసిక రంధ్రాలు తెరుచుకుని శ్వాస లో ఇబ్బందులు తొలిగిపోతాయి. దాంతో గొంతునొప్పి కూడా తగ్గుతుంది. గొంతునొప్పి ఉన్నప్పుడు సులభంగా జీర్ణమయ్యే అరటి పండు తినాలి. దాంతో ఎనర్జీ తో పాటు పొటాషియం మరి కొన్ని విటమిన్ శరీరానికి అందుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: