గ్యాస్ ప్రాబ్లెమ్‌తో బాధపడుతున్నారా.. అయితే ఉదయాన్నే వవ వాటర్ తాగండి..!
ఇక గ్యాస్టిక్ ట్రబుల్ కు మిరియాలు, నిమ్మరసం అద్భుతంగా పని చేస్తాయి. ఇక ఈ రెండిటిని కలిపి మిశ్రమంగా తీసుకుంటే శరీరంలో పేరుకొన్న విషవాయువులను బయటకు పంపిస్తుంది. నిమ్మకాయ, మిరియాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి గొప్ప సహాయకారిగా పని చేస్తుంది. ఇది అన్ని జీర్ణసమస్యలను తొలగించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రోగనిరోధకశక్తి పెంపొందేందుకు తోడ్పడుతుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే సహజంగా నిమ్మలో ఉండే సి విటమిన్.. జలుబు, అలెర్జీ వంటి అనేక వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచడానికి మిరియాలు, నిమ్మరసం సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచిదే. రక్తనాళాలలో ఉన్న ప్రతిష్టంభనను తొలగిస్తుంది. శరీరంపై గాయాలను త్వరగా నయం చేయడానికి తోడ్పడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుందన్నారు.
అంతేకాదు.. ప్రతి రోజు ఉదయాన్నే గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక చెక్క నిమ్మరసం పిండి, దానికి చిటికెడు ఉప్పు, పావు స్పూన్ మిరియాల పొడి జోడించి తాగాలి. ఇది ఊబకాయాన్ని తగ్గించడంలో అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది. ఇక సహజంగా బరువు తగ్గేందుకు ఆహార నియాలతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే బరువు తగ్గుతారు. జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.