కని కరోనా: ఎవరు ఎలాంటి మాస్క్ ధరించాలో తెలుసా..?

Divya

కరోనా.. కరోనా.. కరోనా.. ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి నోటా ఇదే పదం ఊత పదం గా మారిపోయింది.. ఇందుకు కారణం ప్రజల్లో భయం. అంతేకాదు  ఇది సోకిన వారిలో కొంతమంది చనిపోతున్నారు కూడా.. కరోనా విజృంభించి దాదాపు ఒకటిన్నర ఏడాది ముగిసినప్పటికీ, ఏ మాత్రం అలసిపోకుండా ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. ప్రపంచ దేశాల ప్రజలందరినీ ఒక్కసారిగా అతలాకుతలం చేసింది .. ఇక ఈ కరోనా నుంచి విముక్తి పొందాలి అంటే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. అలాగే శానిటైజర్ ను ఉపయోగించాలి . అంతేకాకుండా స్వీయ శుభ్రత, పరిసరాల శుభ్రత కూడా పాటించాలి. అప్పుడు ఈ కరోనా మన దగ్గరకు రావడానికి భయపడుతుంది..


ఇక ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో మాస్కులు ఒక నిత్య భాగమయ్యాయి. ఈ వైరస్ బారిన పడకుండా ఉండడానికి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఎంత ముఖ్యమో, మాస్కులు ధరించడం కూడా అంతకంటే ముఖ్యం అని నిపుణులు పదే పదే చెబుతున్నారు, అలాగే హెచ్చరిస్తున్నారు కూడా.. ఈ క్రమంలోనే కొంతమంది క్లాత్ తో తయారు చేసిన మాస్కులను ఎంచుకుంటే, మరికొంతమంది బయట దొరికే మెడికల్ మాస్కూలను కొని ధరిస్తున్నారు.. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ మాస్కులు ధరించడం అలవాటైపోయింది..


కానీ అసలు నిజానికి వస్తే..ఎవరు ఎలాంటి మాస్కులు ధరించాలి..? అనే సందేహం కొంతమంది లో ఉంది అని చెప్పవచ్చు. అయితే ఎవరెవరు ఎలాంటి మాస్కులు ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం..


మెడికల్, సర్జికల్ మాస్కులు ఎవరికి..?
వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారు, కరోనా బాధితులకు సేవ చేస్తున్న వారు, వైరస్ విస్తృతి ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, కనీసం ఒక మీటరు దూరం కూడా పాటించలేని ప్రదేశాలు, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ మెడికల్ మాస్కులు ధరించడం తప్పనిసరి..

ఇక క్లాత్ మాస్కులు ఎవరికి..?
కరోనా లక్షణాలు లేని వారు, కనీసం ఒక మీటరు సామాజిక దూరం పాటించలేని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు క్లాత్ మాస్కులు ధరించాలి. సామాజిక కార్యకర్తలు, సర్వర్స్ ని కలిపే వ్యక్తులు, క్యాషియర్స్ వీరంతా క్లాత్ తో తయారు చేసిన మాస్కులు ధరించడం అవసరం. అలాగే ప్రజా రవాణా,పని ప్రదేశాలు, గ్రోసెరీ స్టోర్, ఎక్కువమంది గుమిగూడి ఉండే ప్రదేశాలు.. ఇలాంటి ప్రదేశాల్లో ఈ మాస్కులు మనకు రక్షణ కల్పిస్తాయి..


అయితే ఈ క్లాత్ మాస్కులు ఎంచుకునే విషయంలో కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి.. క్లాత్ మాస్కులు ఎంచుకునే వారు రెండు లేదా అంతకంటే ఎక్కువ లేయర్లు, సులభంగా శ్వాస తీసుకోవడానికి వీలుగా ఉండే సౌకర్యవంతమైన మాస్కును ఎంపిక చేసుకోవాలి. ఈ క్రమంలోనే వినైల్ ఫ్యాబ్రిక్ తో రూపొందించిన మాస్కులకు  ఎంత దూరంగా ఉంటే అంత మంచిది  ఎందుకంటే దీన్ని ధరించడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.


ఈ కరోనా వైరస్ ను మన జీవితాల్లో నుంచి సమూలంగా తొలగించేందుకు ఈ మాస్కులు మనకు శ్రీరామరక్ష లాంటివి...  అందుకే మాస్క్ ధరించండి.. కరోనా ను పారద్రోలండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: