ఎండాకాలంలో గర్భిణులు పాటించాల్సిన జాగ్రత్తలు....
సమయానికి తినడం సరిగా నీళ్లు తాగడం లాంటివి చేస్తూ ఉండాలి. ఎటువంటి బాధలు లేకుండా పాజిటివ్ గా వుంది ఆనందంగా ఉండాలి అని గైనకాలజస్ట్ ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక విషయాల కోసం మన తో చర్చించారు. అవి చూస్తే గర్భిణీలకు ఎంతో ఉపయోగ పడతాయి పైగా వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలి ఇలా అనేక విషయాలు కూడా వాళ్ళకి అర్థం అవుతాయి.ఎక్కువగా ఆకు కూరలు, కాయగూరలు నెక్స్ట్ గింజలు, సలాడ్, ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోండి. పెరుగు మజ్జిగ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. పుల్లటి వాటిని తీసుకోవద్దు ఎక్కువ నూనె ఉపయోగించడం మరియు ఎక్కువ నెయ్య కి, మసాలాలు కి దూరంగా వుండండి. వీలైనంత తక్కువ మసాలాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. పూర్తిగా సాల్ట్ ని వేసుకోకుండా తీసుకోవడం మంచిది.
కనుక తాజాకూరలు వంటి వాటిని ఆహారంలో ఎక్కువగా తీసుకోండి. ముఖ్యంగా బయట చేసిన వాటిని తీసుకోకపోవడమే మేలు. కనీసం రోజులో మూడు లీటర్లు నీళ్లు తాగండి. లేదా లేతగా ఉండే కొబ్బరి నీళ్లు తాజాగా చేసిన జ్యూసులను తీసుకోవచ్చు. ఒకవేళ కనుక మీకు డయాబెటిస్ ఉంటే వీటిని తీసుకోవద్దు లేదా తక్కువ పంచదార వేసుకుని తీసుకోండి. మీరు సరిగ్గా సరిపడా నీళ్లు తాగారుఅంటే మీకు హీట్ స్ట్రోక్ లాంటివి ఉండవు. పైగా మీరు డీహైడ్రేషన్ కి గురవకుండా ఉండొచ్చు. కాబట్టి రోజులో తప్పకుండా ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. వీటి వల్ల మనకి చాలా ప్రయోజనం కలుగుతుంది. పైగా ఆరోగ్యం కూడా బాగుంటుంది.