హెల్తీ స్కిన్ కోసం ఈ మెక్కలను ఇంట్లో పెంచుకోండి..!
పుదీనా ఆకులు
పుదినా ఇంట్లో హోం గార్డెన్ లో పెంచుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. పుదినా వంటల్లో మాత్రమే కాకుండా స్కిన్ కేర్ లోనూ ఎంతో మేలు చేస్తుంది. పుదినా రసాన్ని ముఖానికి రాసుకుంటే ఆయిల్ ఫ్రీగా మారి మెటిమలను తగ్గింస్తుంది. పుదినా ఆకులను వేడినీడిలో వేసి ఆ నీరు త్రాగితే గ్యాస్ సమస్యలు దూరం అవుతాయి. అంతే కాకుండా పాదాలకు రాసుకుంటే పాదాల పగుళ్ల సమస్య దూరమవుతుంది.
కొత్తిమీర ఒక ఆరోమాటిక్ హెర్బ్. కొత్తిమీరను ఎక్కువగా వంటల్లో వాడుతాం కానీ ఇది కూడా స్కిన్ కేర్ కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది. కొత్తిమీరలో యాంటి సెప్టిక్, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. ఇది స్కిన్ ను ఆరోగ్యవంతంగా ఉంచడంలో ఉపయోగపడతాయి. యాంటీ ఫంగల్ గుణాలుండటం వల్ల కొత్తిమీర రసాన్ని ముఖానికి రాసుకుటే మొటిమలు తగ్గుతాయి. తీన్ని మన హోం గార్డెన్ లో సులభంగా పెచుకోవచ్చు.
దీనిని ఔషద మెక్క అని చెప్పవచ్చు. ముఖ్యంగా బ్యటీ ప్రొడక్ట్ ల తయారీలో దీనిని ఎక్కువగా వాడుతుంటారు. అలోవేరాలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అలోవేరా జిగురును స్కిన్ కు రాసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యవంతంగా మెరుస్తుంది. అంతే కాకుండా హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల జుట్లు దృడంగా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. దీనిని హోం గార్డెన్ లో పెంచుకోవచ్చు.
ఇది సాధారణంగా అందరి ఇళ్లలో ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా పెంచుకోండి. ఎందు కంటే తులసి తో ఎన్నో ప్రయోజనాలుంటాయి. తులసి జలుబును, దగ్గును తగ్గించడంలో ఉపయోగపడుతుందని మనకు తెలుసు కానీ తులసి చర్మసౌందర్యాన్ని కూడా పెంచడంలో ఉపయోగపడుతుంది. తులసిలో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి చర్మంపై మొటిమలను దూరం చేస్తాయి. సెన్సిటివ్ మరియు ఇరిటేషన్ కలిగించే స్కిన్ కు తులసి అప్లై చేయడం వల్ల ప్రయోజనాలుంటాయి. తులసి ఆకులను పేస్ట్ లా చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మరింత పెరుగుతంది