నిమ్మరసం ఎక్కువగా తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే..!
నిమ్మరసంతో ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలిసిన మనకు దీంతో ప్రమాదం ఉందని తెలియదు. రోజుకు ఒక నిమ్మకాయ కంటే ఎక్కువ రసం తాగితే ప్రమాదమే. ప్రధానంగా నిమ్మరసం మోతాదుకి మించి తీసుకుంటే 7 రకాల సమస్యలు వస్తాయి. ఇది తాగుతున్నప్పుడు ఏమనిపించదు. కొన్నిరోజుల తర్వాత ప్రభావం చూపుతుంది. సమస్యను గుర్తించి నిమ్మరసం అధికంగా తాగడాన్ని ఆపేయాలి. లేదని కంటిన్యూ చేస్తే ఆ ఆరురకాల సమస్యలూ తీవ్రమై వెంటాడుతాయి.
ఇక నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటే మూత్రాశయం అధికంగా పనిచేయాల్సి వస్తుంది. అందువల్ల దానిపై అధిక ఒత్తిడి పడుతుంది. ఫలితంగా మూత్రాశయ వ్యాధులు వస్తాయి. ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. చాకొలెట్లు, స్వీట్లు తింటే పళ్లు పాడవుతాయని అంటుంటాం కదా... నిమ్మరసం ఎక్కువగా తాగితే కూడా చిగుళ్లు పాడైపోతాయి. చాలా మంది నిమ్మరసం, షుగర్ కలుపుకొని తాగుతారు. ఆ షుగర్ అణువుల్ని చిగుళ్లపై ఉండే బ్యాక్టీరియా తింటుంది. అది అక్కడే కాలనీలు నిర్మించుకొని... యాసిడ్లు రిలీజ్ చేస్తుంది. ఫలితంగా చిగుళ్లు దెబ్బతింటాయి.
అంతేకాదు.. నిమ్మరసం మన నాలికకు ప్రమాదకరం. ఓ వారం పాటూ... రెగ్యులర్గా నిమ్మరసం తాగుతూ పోతే... నాలిక మండుతుంది. అక్కడక్కడా పగుళ్లు వస్తాయి. అసౌకర్యంగా అనిపిస్తుంది. సరిగా మాట్లాడలేరు. ఈ పగుళ్ల సమస్యలు ఓ వారం పాటూ ఉండి... వాటంతట అవే తగ్గిపోతాయి. కొంతమందికి నిమ్మరసం తాగితే... తలనొప్పి వస్తుంటుంది. అలాంటి వారు దానికి దూరంగా ఉండటం బెటర్. ఎందుకంటే... ఎక్కువ నిమ్మరసం తాగితే... అది మైగ్రేన్ తలనొప్పికి దారితీస్తుంది.