దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. అంతే కాకుండా రోజుకు వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఇక రాష్ట్రాల్లోనూ కరోనా ఉజృంభన కనిపిస్తోంది . ఏపీలో గడిచిన 24 గంటల్లోనే 14వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 1,14,158 కు చేరింది. అంతే కాకుండా ఒక్కరోజులో 8వేల మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇక కరోనా విజృంభన నేపథ్యంలో చికిత్సకు అవసరమైన మందుల కొరత కూడా భారీగా ఏర్పడింది. చికిత్సకు ఎంతో అవసరమైన కొన్ని మందులు దొరకడం లేదు. మరోవైపు నకిలీ మందులు కూడా అమ్మతు కేటుగాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. అత్యవసర సమయాల్లో మందులు దొరక్క కుటుంబాలకు సైతం ఆందోళన చెందుతున్నాయి .
ఎంత డిమాండ్ చేస్తే అంత డబ్బు ఇచ్చి కొనడానికి సిద్ధంగా ఉన్న ముందుకు దొరకని పరిస్థితి నెలకొంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ అత్యవసరమైన మందులు కావాలంటూ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ట్వీట్టర్ లో రోజుకు వేల సంఖ్యలో రెమిడెసివిర్ కావాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. పేషెంట్ సీరియస్ గా ఉన్న పరిస్థితుల్లో ఊపిరితిత్తుల్లోని ఇన్పెక్షన్ ను తగ్గించడానికి ప్రస్తుతం డాక్టర్లు ఇదే ఇంజెక్షన్ ను సూచిస్తున్నారు. దాంతో ఈ ఇంజక్షన్ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.ఒకప్పుడు వెయ్యి రూపాయలకు వచ్చిన ఈ ఇంజెక్షన్ ను ఇప్పుడు 40 వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే షాటేజ్ కారణంగా నలభైవేలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాప్రస్తుతం ఈ ఇంజెక్షన్ దొరకడంలేదు.
అయితే ఇక్కడ కరోనా చికిత్స అవసరమైన కొన్ని మందులను..అవి దొరికే ప్రదేశాలను మరియు అమ్మే వ్యక్తుల వివరాలను పొందుపరిచాం కావాల్సిన వాళ్ళు సదరు నంబర్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకోగలరు .