గర్భిణులు టీకా తీసుకోవచ్చా?

Purushottham Vinay
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ వేయించుకోవడం సురక్షితం. ఇక వ్యాక్సిన్ వేయించుకోవడంలో చాలా మందికి ఎన్నో సందేహాలు ఇంకా అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వ్యాక్సిన్ వేయించుకోవచ్చా అనే విషయంపై కూడా చాలా మందికి చాలా సందేహాలు వున్నాయి. ఇక నిపుణులు ఏమంటున్నారంటే.. గర్భిణులు టీకా వేయించుకోవచ్చనీ..తల్లీకి బిడ్డకు ఎటువంటి ప్రమాదము ఉండదని తెలిపారు.టీకాలు గర్భిణులకు కూడా సురక్షితమేనని చెబుతున్నారు. కరోనా టీకాలు వేయించుకున్న 84 మంది గర్భిణులను..టీకా వేయించుకోని 116 మంది గర్భిణులను పరిశీలించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చామని..అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన ఫీన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జెఫరీ గోల్డ్‌స్టీన్ తెలిపారు.


వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల గర్భంలోని మాయకు హాని కలుగుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని 'ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ' జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది.మాయ అంటే గర్భధారణ సమయంలో ఏర్పడే మొదటి అవయవం. దీన్నే మావి అని కూడా అంటారు. శిశువుకు అవయవాలు ఏర్పడుతున్నప్పుడు ఈ మాయ చాలా విధులను నిర్వర్తిస్తుంది. గర్భధారణ సమయంలో ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతున్న ఒక అవయవం అనికూడా చెప్పవచ్చు.


ఇది ఒక రకమైన జిగట ద్రవ్యరాశి.ఇది గర్భాశయానికి అనుసంధానించబడి ఉంటుంది. అంతేకాదు మాయ ద్వారా తల్లీ..బిడ్డల మధ్య ముఖ్యమైన సంబంధం ఏర్పడుతుంది. మావి ద్వారా, శిశువు ఆక్సిజన్ మరియు దాని గర్భధారణ 40 వారాలలో అభివృద్ధి చెందడానికి మరియు పెరగడానికి అవసరమైన అన్ని పోషకాలను పొందుతుంది.మాయ అనేది విమానాల్లో బ్లాక్‌బాక్స్ లాంటిదని నిపుణులు చెబుతున్నారు. మాయలో సంభవించే మార్పులు గర్భంలో తలెత్తే సమస్యలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని జెఫరీ గోల్డ్‌స్టీన్ వెల్లడించారు.


గర్భస్థ బిడ్డకు కరోనా వ్యాపించకుండా ఉండేందుకు తల్లికి టీకా వేయడం మంచిదని ఆమె ద్వారా యాంటీబాడీలు బిడ్డకు కూడా చేరుతాయని ఆయన పేర్కొన్నారు. హార్మోనుల తయారీ మొదలు వ్యాధుల రక్షణకు వ్యవస్థలు ఏర్పడడానికి కూడా మాయే ఆధారమని పేర్కొన్నారు. టీకా వేసుకున్నతర్వాత కూడా మాయ యథావిధిగా తన పని తాను చేస్తోందని తమ పరిశోధనలో తేలిందని గోల్డ్‌స్టీన్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: