ఈ ఆహారాన్ని తినడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయట..!

Divya

కరోనా కారణంగా చాలామంది ఆక్సిజన్ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ పోషక విలువలు కలిగిన ఆహారపదార్ధాలను డైట్ లో తీసుకుంటే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. దీంతో ఆక్సిజన్ లెవెల్స్  పెంపొందించడానికి వీలవుతుంది. అయితే ఆ ఆహార పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.

1). కమలా పండు:
ఈ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నందువల్ల ఆక్సిజన్ లెవెల్స్ ను పెంపొందించడానికి ఎంతో సహాయ పడతాయి.
2). స్ట్రాబెర్రీస్:
వీటిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి స్ట్రాబెర్రీస్ బాగా సహాయపడుతాయి. కనుక కరోనా బారినపడిన వారు తప్పక తీసుకోవడం మంచిది.
3). శెనగలు:
 శెనగల లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.ఆక్సిజన్ లెవెల్స్ ను సరిగ్గా ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
4). పుచ్చకాయలు :
పుచ్చకాయలు వేసవి కాలంలో మనకు ఎక్కువగా దొరుకుతాయి. ఇందులో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఆక్సిజన్ లెవెల్స్ ను   పెంపొందించడానికి సహాయపడుతుంది.
5). కివి :
 కివీ లో కూడా అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి . ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందువల్ల కరోనా వైరస్ బారి నుండి రికవరీ అవ్వడానికి ఇది బాగా సహాయపడుతుంది.
6). మామిడి:
మామిడి పండులో విటమిన్ ఎ మరియు విటమిన్ సి సమృద్ధిగా లభిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి బాగా సహాయపడుతుంది. ఆక్సిజన్ లెవల్స్ ను కూడా పెంపొందించడానికి మామిడి బాగా సహాయపడుతుంది.
7). ఉసిరి : ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఆక్సిజన్ లెవల్స్ ను పెంపొందించడానికి ఉసిరి ఎంతగానో సహాయపడుతుంది.
 8).వేయించిన జీలకర్ర:
ఆక్సిజన్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కనుక వేయించిన జీలకర్ర తీసుకోవడం  మంచిది. ( ఇందులోకి ఉప్పు ని వేసుకోకూడదు )

పైన చెప్పిన విధంగా, పాటించడం వల్ల మన శరీరంలోని ఆక్సిజన్ లెవెల్ ను పెంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: