ఎల్లో ఫంగస్ ని గుర్తించడం ఎలా?
ఎల్లో ఫంగస్ ని ఎలా గుర్తించాలంటే..కళ్లు ఉబ్బినా, కంటికి సంబంధించిన ఏమైనా సమస్యలు వస్తే వైద్యుడిని సంప్రదించాలి.గాయాలు చీము పట్టడం, గాయాలు మానేందుకు ఎక్కువ సమయం పట్టడం. అవయవాల పనితీరు మందగించడం.పోషకాహార లోపం కూడా ఎల్లో ఫంగస్ లక్షణాల్లో ఒకటి.ఆకలి లేకపోవడం, అకస్మాత్తుగా బరువు తగ్గిపోతున్నట్లయితే ఎల్లో ఫంగస్‌గా భావించాలి.ఇవన్నీ కూడా ఎల్లో ఫంగస్ లక్షణాలు..
ఎల్లో ఫంగస్ శుభ్రంగా లేకపోవడం వలన వ్యాపిస్తుంది. కరోనా వైరస్ సోకిన రోగులు లేదా, వైరస్ లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులు తగిన శుభ్రత పాటించకపోతే ఈ ఫంగస్లకు గురయ్యే ప్రమాదం ఉంది. బ్లాక్, వైట్ ఫంగల్ ఇన్ఫెక్షన్లు పర్యావరణంలో ఉండే ‘మ్యుకోర్మేసెటెస్’ అనే శిలీంధ్ర బూజుల వల్ల ఏర్పడుతున్నాయి. ఇవి అంటువ్యాధులు కావు. కానీ, ఈ బూజును రోగులు సులభంగా పీల్చగలుగుతారు. అపరిశుభ్ర వాతావరణం, నీటిలో ఈ ఫంగస్ ఉండే అవకాశాలున్నాయి. తక్కువ రోగ నిరోధక శక్తి కలిగిన వ్యక్తులు ఈ ఫంగస్ కలిగిన వస్తువులను తాకినప్పుడు ఇది సోకుతుంది.కోవిడ్ బాధితులకు ‘హ్యూమిడిఫయర్లు’ ద్వారా ఆక్సిజన్ అందిస్తారు. వీటిలో స్టెరైల్ వాటర్‌ను ఉపయోగించాలి. వాటికి బదులు సాధారణ నీటిని వాడితే ‘బ్లాక్ ఫంగస్’ ఏర్పడే ప్రమాదం ఉందట.ఎల్లో ఫంగస్‌తో పోల్చితే బ్లాక్, వైట్ ఫంగస్ కేసులు బాగా పెరుగుతున్నాయి. కాబట్టి వాటి నుంచి కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రాణాలు కాపాడుకోండి.