ఈ టిప్స్ తో మోకాళ్ళ నొప్పులు మాయం..

Purushottham Vinay

చాలా మంది మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధ పడుతూ వుంటారు. ఎన్ని మందులు వాడిన మోకాళ్ళ నొప్పుల సమస్యలు అస్సలు తగ్గవు. అయితే ఈ న్యాచురల్ టిప్స్ తో చాలా ఈజీగా మోకాళ్ళ నొప్పుల సమస్యని తగ్గించుకోవచ్చు. ఇక ముందుగా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఈ రెసిపీ తయారు చేసుకోండి..

ముందుగా కావాల్సిన పదార్థాలు: అర టీ స్పూన్ మిరియాలు, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ మెంతి గింజలు

తయారుచేసే విధానం: ముందుగా మిక్సీలో మెంతి గింజలను తీసుకుని రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మెంతిగింజల పొడిని జల్లెడ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆతర్వాత అదే మిక్సీలో నల్ల మిరియాలు వేసి, మిక్సీ వేయండి. మెత్తని పిండిలా వచ్చేందుకు మళ్ళీ జల్లెడ పట్టండి. ఇప్పుడు మళ్లీ అదే మిక్సీ గిన్నెలోకి జీలకర్రను తీసుకుని, మిక్సీ పట్టండి. దీనిని జల్లెడ పట్టి, అన్ని పదార్ధాలను బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక ఏర్ టైట్(గాలి చొరబడని) కంటైనర్‌లోకి తీసుకుని నిల్వచేయండి. ఇప్పుడు ఒక గ్లాస్ నీరు తీసుకుని, అందులో సగం చెంచా మిశ్రమం వేసి కలపండి. ఇది కొంచెం చేదుగా ఉంటుంది. కాబట్టి రుచి కోసం బెల్లం కలుపుకుని తాగొచ్చు.ఇది రోజు క్రమం తప్పకుండా తాగితే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.


ఇక గుర్తు పెట్టుకోవాల్సిన అసలైన విషయం ఏమిటంటే..మోకీళ్లు నొప్పులతో బాధ పడుతూ ఆర్థరైటిస్‌ సమస్య ఉన్నప్పుడు నొప్పి తగ్గించే మందులు వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి. వాటితో పాటు నొప్పిని పెంచే పనులు తగ్గించి, కీళ్లను బలపరిచే వ్యాయామాలు సాధన చేయాలి. మోకాళ్ల సమస్యలు ఉన్నవారు మెట్లు ఎక్కడం, ఏటవాలు ప్రదేశాల్లో నడవడం వంటి పనులు చేయకూడదు. ఏరోబిక్‌, జుంబా వ్యాయామాల్లో భాగంగా స్టెప్పర్‌ను వాడడం వల్ల కీళ్ల మీద ఒత్తిడి పెరిగి నొప్పులు పెరుగుతాయి. కాబట్టి ఈ పనులు మానుకోవాలి. అలాగే మోకాళ్లు వంచి చేసే పద్మాసనం, వజ్రాసనం వంటి యోగాసనాలు వేయకూడదు. నేల మీద బాసింపట్టా వేసి అస్సలు కూర్చోకూడదు.ఇక రోజుకి వీలైనన్ని సార్లు నీళ్లు తాగడం చాలా మంచిది. అలాగే మోకాళ్ళ ఎముకలు గట్టి పడటానికి నాన్ వెజ్ ఎక్కువగా తినాలి. దీని వలన మోకాళ్ళ కండరాలు చాలా గట్టిపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: