ఈ పండుని డైట్ గా తీసుకుంటే షుగర్ మాయం..

Purushottham Vinay
ఇక చాలా మంది ఎక్కువగా బాధ పడే సమస్య డయాబెటిస్ సమస్య. ఈ సమస్య ఒక్క సారి వచ్చిందంటే ఇక జీవితాంతం అస్సలు పోదు. తెగ ఇబ్బంది పెడుతుంది. దీని వల్ల ఎన్నో అనర్ధాలు ఉంటాయి.డయాబెటిస్ వ్యాధి ప్రతి 10 మందిలో తప్పనిసరిగా 6 మందికి ఉంటుంది. డయాబెటిస్ ని నేరేడు పండ్లతో కంట్రోల్ చేసుకోవచ్చు. నేరేడు పండు ఒక శక్తివంతమైన యాంటీడియాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అలాగే యాంటీఆక్సిడెంట్ ప్రభావాలతో ఫినోలిక్ అలాగే ఫ్లేవనాయిడ్ సమ్మేళనాలతో నిండి ఉండే పండు.నేరేడులో యాంటీ-డయాబెటిక్ గుణాలు ఎక్కువగా వున్నాయి.షుగర్ వ్యాధి అనేది ఇన్సులిన్ లోపం లేదా పనిచేయకపోవడం వల్ల కలిగే దీర్ఘకాలిక సమస్య.నేరేడు పండు గుజ్జు ఇంకా విత్తనాలు శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో అలాగే పరిస్థితిని నివారించడంలో బాగా పని చేస్తుంది.


నేరేడు పండులోని ప్రాధమిక భాగాలలో ఆంథోసైనిన్స్ అనే ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి, ఇవి నేరేడు పండుకు ఊదా రంగును ఇస్తాయి.దీనిలో ఐరన్, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, జింక్ అలాగే సోడియం వంటి మినరల్స్ కూడా ఉన్నాయి...సి, ఎ, బి 3 ఇంకా బి 6 వంటి విటమిన్లు అలాగే ఆక్సాలిక్ ఆమ్లాలు, గాలిక్ ఆమ్లాలు ఇంకా టానిక్ ఆమ్లాలు అలాగే కొన్ని ఆల్కలాయిడ్ల వంటి ఫైటోకెమికల్స్ కూడా ఉన్నాయి.ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.నేరేడులో అత్యధిక యాంటీ-డయాబెటిక్ పోషకాలు 86.2 శాతంగా ఉన్నాయని, ఆ తరువాత విత్తనం 79.4 శాతం, గుజ్జు 53.8 శాతంగా ఉందని అధ్యయనంలో తెలిసింది.గ్లైసెమిక్ స్థాయిలను సరిగా తగ్గించని టైప్ 2 డయాబెటిస్‌లో గ్లూకోజ్ స్థాయిని పెంచడానికి నేరుడు పండ్ల విత్తన పౌడర్ సహాయపడుతుంది.నేరేడు విత్తనం పౌడర్ తీసుకునేముందు ముందు వైద్య నిపుణులను సంప్రదించండి.ఇలా రోజు మీ డైట్ లో నేరుడు పండుని అలవాటు చేసుకుంటే క్రమ క్రమంగా షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: