ఫ్రిడ్జ్ లో పెట్టకూడని పదార్థాలు ఇవే.. అందరూ తెలుసుకోండి?
ఇలా ఆధునిక జీవన శైలిలో రిఫ్రిజిరేటర్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. అయితే రిఫ్రిజిరేటర్ వాడకం ఏమాత్రం మంచిది కాదని రిఫ్రిజిరేటర్ లో పెట్టిన ఆహార పదార్థాలు పానీయాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఎంతో మంది నిపుణుల హెచ్చరికలను పట్టించుకోకుండా రిఫ్రిజిరేటర్ ఉపయోగిస్తారు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్ లో అస్సలు పెట్టవద్దు అని చెబుతున్నారు నిపుణులు.
ఇలా పెట్టడం వల్ల ఇక ఆహార పదార్థాల వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏమీ ఉండదు అని అంటున్నారు. అయితే ఇక ఫ్రిజ్ లో పెట్టిన ఆహారాలు తినడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయట. సాధారణంగా ప్రతి ఒక్కరూ టమాటాలను ఫ్రిజ్లో పెడుతుంటారు కానీ టమాటాలు ఫ్రిజ్లో పెట్టడం వల్ల వాటి సహజత్వాన్ని కోల్పోతాయిట. ఇక ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే అరటిపండు సైతం ఫ్రిజ్ లో పెట్టవద్దని సూచిస్తున్నారు నిపుణులు. అవకాడో, వంకాయలు, పుచ్చకాయలు,తేనే,వెల్లుల్లి,చాక్లెట్లు కర్బుజా,తులసి,ఉల్లి, గుడ్లు, స్ట్రాబెర్రీలు,దోసకాయలు, కాఫీ పొడి, బ్రెడ్, పీనట్ బటర్, కచేప్, నారింజ లు లాంటివి ఫ్రిజ్లో పెట్టకూడదు అని చెబుతున్నారు ఇలాంటివి రిఫ్రిజిరేటర్ లో పెట్టడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.