బీరకాయ తినడం వల్ల మన శరీరానికి లభించే పోషకాలు ఎన్నో ..

Divya

మనకు సాధారణంగా దొరికేటటువంటి కాయగూరల్లో బీరకాయ కూడా ఒకటి. బీరకాయతో రకరకాల వంటలు చేసుకుంటూ ఉంటారు. అయితే బీరకాయ మనం తినడం వల్ల, ఎటువంటి పోషకాలు లభిస్తాయి. ఎటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అనే విషయాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.


బీరకాయ చాలా శ్రేష్టమైనది.చాలా మంచిది. మనం తీసుకునేటప్పుడు కాయలను రంగు ఎక్కువగా ముదిరి పోకుండా చూసుకోవాలి. బీరకాయలు ఎక్కువ లేతగా ఉండేవి తీసుకోకూడదు. మధ్యస్తంగా ఉండేవి తీసుకోవాలి. ఈ కాయలు మనం చేతిలో పట్టుకున్నప్పుడు బరువుగా అనిపించాలి. మెత్తబడిన కాయల తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. బాగా ఫ్రెష్ గా ఉండేవి మాత్రమే తీసుకోవాలి.

1). బీరకాయ ఎక్కువగా పీచు పదార్థాన్ని కలిగి ఉంటుంది. ఇందులో క్యాలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి.

2). ఈ కాయలో  ఎక్కువగా బి కాంప్లెక్స్ , విటమిన్స్ ఉంటాయి. అంతేకాకుండా మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.

3). ఎసిడిటి ఉన్నవారు తీసుకోవడంవల్ల అది తొందరగా తగ్గుతుంది. మొలల వ్యాధితో బాధపడేవారికి బీరకాయ చాలా మంచి చేస్తుంది.

4). బీరకాయ పైన వచ్చిన పీచుతో శరీరానికి స్క్రబ్  గా ఉపయోగించుకోవచ్చు. శరీరంపై ఏర్పడిన పొడి చర్మాన్ని తొలగించడానికి బీరకాయ పీచు ఎంతగానో ఉపయోగపడుతుంది.

5). ఇందులో పీచు పదార్థం ఉన్నది కాబట్టి మలబద్దక సమస్యతో బాధపడుతున్నవారు, వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల వారికి సులభంగా నయం అవుతుంది. అంతే కాకుండా గుండెకు కూడా మంచిది. శరీరంలోని అధిక కొవ్వు శాతాన్ని  సైతం కరిగించేస్తుంది.

6). బీరకాయలో నీరు 90% ఉంటుంది. ఫైబర్ 5% ఉంటుంది. కొవ్వు కణాలు తక్కువగా ఉంటాయి.

7). డయాబెటిస్ ఉన్నవారు ఈ కాయను ఆహారంలో తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇందులోని పీచుపదార్థాలు, ఫ్లేవనాయిడ్స్ , రక్తంలోని  షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి. అంతేకాకుండా రక్తంలో ఇన్సులిన్ లెవల్స్ ను స్థిరంగా ఉంచుతాయి.

8).బీరకాయ చాలా సులువుగా జీర్ణమవుతుంది.శరీరంలోని ఎక్కువ వేడి ఉన్నవారు. బీరకాయ ను తీసుకోవడం వల్ల చల్లగా ఉంటారు.

9). శరీరానికి ఇన్ఫెక్షన్ సోకకుండా చేసి, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: