నీరసంగా ఉన్న వారికి బలమైన ఆహారాన్ని ఇచ్చే పదార్థాలు..

Divya
మనకి తెలిసిన మేరకు బలమైన ఆహారం అంటే. జీడిపప్పు, బాదంపప్పు, వాల్ నట్స్ ఇలాంటివన్నీ బలమైన ఆహారం అని చెప్పుకుంటూ ఉంటాము. కానీ ఇవన్నీ కేవలం బాగా డబ్బు ఉన్న వారు మాత్రమే ఎక్కువగా కొనవచ్చు. కానీ పేదవారికి బలాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
1). వేరుశెనగ గింజలు:
వేరుశనగ గింజలను పేదవారి జీడిపప్పుగా పరిగణిస్తారు. ఇవి తినడానికి రుచికరంగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి మనిషికి బలాన్ని చేకూరుస్తాయి. ఇందులో మాంసకృతులు చాలానే ఉంటాయి. ఎటువంటి పనిచేసే వారైనా ఈ గింజలను తీసుకోవడం వల్ల శక్తి మరింత లభిస్తుంది.  ఈ గింజలను ముఖ్యంగా తినే ముందు 7 నుండి 8 గంటల పాటు నానబెట్టాలి.
2). ఖర్జూరం పండు:
ఈ పండ్లను ప్రతి రోజు తినడం వల్ల శరీరంలోని ఐరన్ పెరుగుతుంది.
3). పచ్చికొబ్బరి:
పచ్చికొబ్బరి తినడం వల్ల శరీరంలోని భాగాలకు కొవ్వు ఎక్కువ కాకుండా చూస్తుంది. ఎండు కొబ్బరి తింటే దగ్గు వస్తుంది కానీ, పచ్చికొబ్బరిని తురిమి తినడంవల్ల ఎలాంటి నష్టం జరగదు. ఇందులోకి ఎండు ఖర్జూర పండ్లను నంచుకుని తినడం వల్ల మనకు ఎంతో శక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఇలా తినడం వల్ల తెలివితేటలు కూడా పెరుగుతాయి.
4). తెల్ల నువ్వులు:
ఈ నువ్వులలో అత్యధిక క్యాల్షియం ఉంటుంది. వీటిని బాగా వేయించి, మిక్సీ కి వేసి అందులో వచ్చిన పొడిని తీసుకొని ఎండు ఖర్జూరాన్ని, బెల్లం నున్ కలిపి దంచడం వల్ల బాగా ముద్దగా తయారవుతాయి. అలా తయారైన ముద్దులను ప్రతిరోజు మనం భోంచేసిన తర్వాత ఒక ముద్దను తీసుకోవడం వల్ల క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది.
5).పుచ్చ గింజలు:
ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని  నానబెట్టుకుని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. వీటిని పొడి రూపంలో అయినా తీసుకోవచ్చు.
చివరిగా మీరు ఏదైనా ఆహారం గురించి తినాలనుకుంటే అందులో ముఖ్యంగా"సోయా బీన్స్"తినడం మంచిది. కాబట్టి ఈ పోషకాలు కలిగిన ఈ గింజలను ప్రతి రోజు తినడం వల్ల ఆరోగ్యంగా, బలిష్టంగా ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: