రియల్ లైఫ్ కుంభకర్ణుడు.. నెలలో 25 రోజులు నిద్ర?
ఇంకా ఎక్కువ అంటే ఒక రోజు నిద్ర పోతారు.. కానీ అంతకంటే ఎక్కువ ఎవరైనా నిద్ర పోతారా.. నిద్ర పోవాలి అని ప్రయత్నించినప్పటికీ కూడా అది అసాధ్యం అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా నెలలో 25 రోజులు నిద్రపోతాడు. అతడు మెలుకువగా ఉండేది కేవలం ఐదు రోజులు మాత్రమే ఏంటి షాక్ అయ్యారు కదా.. కానీ ఇది నిజమే.. రాజస్థాన్ కు చెందిన వ్యక్తి సంవత్సరానికి ఏకంగా 300 రోజులు నిద్రపోతున్నాడు. 42 ఏళ్ల పూర్ఖరామ్ అనే వ్యక్తి ఆక్సిస్ హైపర్ సోమ్నియా అని పిలువబడే ఒక అరుదైన రుగ్మతతో బాధపడుతున్నాడు.దీంతో సదరు వ్యక్తి అతనికి తెలియకుండానే ఒకే నెలలో 25 రోజుల నిద్ర పోతూ ఉంటాడు.
23 ఏళ్ల వయస్సు ఉన్న సమయంలో ఈ అరుదైన సిండ్రోం ఉన్నట్లు నిర్ధారణ అయింది. మొదట్లో అందరిలాగానే సాధారణంగా రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే నిద్రపోయేవాడు. కానీ ఆ తర్వాత క్రమ క్రమంగా అతని నిద్ర పెరుగుతూ వచ్చింది. క్రమక్రమంగా గంటలు కాస్త రోజులు కావడం మొదలయింది. 2015 నాటికి అతనిలో లక్షణాలు ఎంతో తీవ్రతరం అయిపోయాయి. దీంతో గంటలు రోజులుగా మారిపోయాయి. మొదట్లో కొన్ని రోజులు మాత్రమే అతను నిద్రించేవాడు. కానీ ప్రస్తుతం ఏకంగా 25 రోజుల పాటు నిద్రపోతున్నాడు. అతను నిద్ర పోయినప్పుడు కుటుంబసభ్యులు అతనికి సపరివార చర్యలు చేయాల్సి ఉంటుంది. అతను తొందరగా కోలుకోవాలని అటు కుటుంబ సభ్యులు అందరూ ఎంతగానో ఆశపడుతున్నారు. అయితే అతను ఒక అరుదైన రుగ్మాత నుంచి కోలుకుని సాధారణ జీవితాన్ని గడుపుతాడు అని అటు వైద్యులు కూడా చెబుతున్నారు. ఏదేమైనా ఇక ఈ నిజజీవిత కుంభకర్ణుడు విషయం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.