నైట్ షిఫ్ట్ చేసే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే...?
అలాగే రాతి వర్క్ చేసేవాళ్ళు వీలయినంత వరకు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటే మంచిది.రాత్రి సమయంలో సులువుగా జీర్ణం అయ్యే తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రి నిద్ర రాకుండా ఉండాలని చాలామంది ఎక్కువగా టీ, కాఫీలను తాగుతూ ఉంటారు. అయితే అది మంచి పద్ధతి కాదు. వాటికి ప్రత్యామ్నాయంగా ఎక్కువగా నీరు తాగితే మంచిది. అలాగే ఆకలిగా అనిపిస్తే ఆహారంలో పండ్లను తీసుకోండి. పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
నైట్ షిఫ్ట్ చేసేవారు ఉదయాన్నే వ్యాయమం చేయలేరు. కావున కనీసం ఇక అరగంట పాటు అయిన యోగా చేయడానికి ప్రయత్నించండి. యోగాకి ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోండి. రాత్రి పూట వర్క్ చేసేవాళ్ళు లైటింగ్ బాగా ఉన్న ప్రదేశంలో పని చేసుకోండి.లైటింగ్ సరిగా లేకపోతే కళ్ళకి మంచిది కాదు. కళ్ళ నొప్పులు, తల నొప్పి ఎక్కువగా వస్తుంది. అలాగే కుర్చీలో రాత్రంతా కూర్చుని అలాగే పని చేయకండి. కొద్ది కొద్దిగా విశ్రాంతి తీసుకుంటూ పని చేయండి. ఒకే పొజిషన్లో ఎక్కువ సేపు కూర్చుంటే నడుము నొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.