గడ్డి గులాబీ ఉపయోగాలు ఎన్నో తెలుసా..?

Divya
గడ్డి గులాబీ అంటే ఈ పదం ఎక్కువగా ఎవరూ విని ఉండరు. కానీ ఈ మొక్క కి మరొక పేరు ఉంది ఆ పేరు ఏమిటంటే "టేబుల్ రోజ్". ఈ పేరు ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈ మొక్కను మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం. ఈ మొక్క ఎటువంటి ప్రదేశం లో నైనా బ్రతకగలదు. అంతే కాకుండా ఈ మొక్క ఇంటి దగ్గర ఉంటే , దీని పూలు ఎంతో అందంగా కనిపిస్తాయి. అయితే ఈ మొక్క ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టేబుల్ రోజా లో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే , ఈ మొక్కను అసలు ఎవరు వదిలిపెట్టరు. ఈ మొక్క చర్మం మీద ఉండేటువంటి నల్లటి మచ్చలను, మొటిమలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఈ మొక్కలో వున్న పువ్వును కోసుకొని,  ఒక మెత్తని పేస్టులాగా చేసి, అందులోకి కొంచెం తేనెను కలిపి ముఖానికి పూసి, చల్లని నీటితో ముఖం కడుక్కోవడం వల్ల, ముఖం చాలా అందంగా మెరుస్తుంది. దీనిని ఇలా వారానికి 2-3 సార్లు చేయడం వలన తప్పకుండా ఫలితం లభిస్తుంది.
ఇక జుట్టు సమస్య ఎక్కువగా ఉండేవారికి ,ఈ మొక్క బాగా ఉపయోగపడుతుంది. ఈ మొక్కల కాండం, ఆకులను బాగా ముద్దగా నూరి, అందులోకి కొంచెం కొబ్బరి నూనె/ఆయుర్వేదం కలిగినటువంటి ఆయిల్ వేసి  బాగా మిక్స్ చేసి జుట్టుకు పట్టించుకోవడం వలన జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది.
ఈ మొక్క యొక్క రసాన్ని ఏదైనా గాయాలు అయినప్పుడు పట్టించడం వలన, ఆ గాయం నుండి రక్త ప్రసరణ ఆగిపోతుంది.
ఇక అంతే కాకుండా చర్మం పై వచ్చిన పొక్కులను (క్షయ వ్యాధి పొక్కులు) పోగొట్టుకోవడానికి, ఈ పూలను బాగా నూరి చర్మంమీద పట్టించడం వలన అవి తగ్గిపోతాయి.  
ఈ మొక్కల వేరుతో కషాయం చేసుకుని తాగడం వలన దగ్గు నుండి విముక్తి పొందవచ్చు. చూశారు కదా ఇకనైనా మీ ఇంటి వద్ద ఈ మొక్కలను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: