వర్షాకాలంలో వాతావరణం అంతా తేమగా ఉండటంతో ఈ యొక్క సమస్య ఎక్కువ అవుతుంది. దీని ద్వారా పెంచుకున్నటువంటి గోర్లు బలహీనమై పోయి విరిగిపోతూ ఉంటాయి. దీంతోపాటుగా వాటి యొక్క సహజ గుణాన్ని కూడా కోల్పోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి. గోళ్ళ సంరక్షణ కోసం చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది అంటున్నారు సౌందర్య నిపుణులు..?
మన శరీర భాగాలలోనే అతి సున్నితమైన వాటిలో గోర్లు కూడా ఒక భాగమే. ఇది ఎక్కువగా నీటిలో నానడం వల్ల వాటిలో ఉన్న తేమను కోల్పోయి బలహీనంగా మారతాయి.
అందుకే వాటికి తిరిగి మళ్ళీ తేమను అందించడం ఎంతో ముఖ్యం. దీనికోసం అల్పా హైడ్రోక్సి లోషన్ ఉపయోగించి కొద్దిసేపు గోర్లకు రాస్తే చాలు ఎంతో ఫలితం ఉంటుంది. దీంతోపాటుగా ఇంటిపనులు చేస్తున్నప్పుడు చేతులకు బ్లౌజులు వాడడం మంచిదని అంటున్నారు. ఎందుకంటే బాసన్లు తోమాడానికి ఉపయోగించే డిటర్జెంట్లు అసిటోన్ అనే ఆమ్లం ఉండటం వల్ల గోళ్లను బలహీనపరుస్తుంది. దీంతోపాటుగా నేలు పాలిష్ లో ఉండేటువంటి అసిటోన్ కూడా గొర్ల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ఏ రసాయనం లేని నేచురల్ ఆర్గానిక్ అని రాసి ఉన్న వాటిని ఎక్కువగా వాడాలి అని నిపుణులు చెబుతున్నారు. గోర్లను శుభ్రం చేసుకునే సమయంలో తరచూ నెయిల్ పాలిష్ ని ఉపయోగించడం వల్ల కూడా గోర్లు బలహీనంగా మారతాయి.
స్నానం చేసే ముందు గోర్లను పెట్రోలియం జెల్లీతో కొద్దిసేపు మర్దనా చేసుకుని ఆ తర్వాత సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. వరుసగా రెండు వారాల్లో ఈ చిట్కాను ఉపయోగిస్తే గోళ్లు బలంగా తయారవుతాయి. వర్షాకాలంలో గోర్లు పెంచుకోవడం కంటే చిన్నగా కత్తిరించు కోవడమే మేలని నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే మనం ఏదైనా పని చేసినప్పుడు ఆ పెరిగిన గొర్లలో బ్యాక్టీరియా చేరి మనం అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఒకవేళ పెంచుకున్న వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం మంచిది. దీంతోపాటుగా వైద్యుల సలహా మేరకు బయోటిన్ సప్లిమెంట్ ని వాడటం మంచిదని నిపుణులు అంటున్నారు.