కిడ్నీ సమస్యలు రాకుండా ఇవి తినండి..

Purushottham Vinay
కిడ్నీలు అనేవి మనకు చాలా ముఖ్యమైన అవయవాలు. వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.కిడ్నీలను బాగా శుభ్రపరచడానికి మంచి నీరుకంటే మంచి సాధనం వేరే లేదు.. అందుకే ఏ విధమైన సమస్య లేని వారు 4 లీటర్ల నీరు ఇంకా ఏదైనా సమస్య ఉన్న వారు రోజుకి 8 నుంచి 10 గ్లాసుల వరకూ మంచి నీరు ఖచ్చితంగా తాగండి.. నీరు టాక్సిన్ పదార్ధాలను బాగా ఫిల్టర్ చేసి తొలగిస్తుంది. ముఖ్యంగా మీ మూత్రం ఎటువంటి దుర్వాసన అనేది లేకుండా ఉంటే మీరు శరీరానికి సరిపడా నీరు తాగుతున్నారు అని అర్ధం.. మూత్రం లో ఏదైనా దుర్వాసన అనేది వస్తే మీ శరీరానికి ఇంకా నీరు చాలా అవసరం అని అర్ధం.ఇక బార్లీ నీరు కేవలం కిడ్నీలను శుబ్రపరచడమే కాదు.. కిడ్నీలు ప్రమాద బారిన పడకుండా కాపాడే శక్తిని కలిగి ఉంటుంది. అలాగే బార్లీ లో ఫైబర్ ఎక్కువుగా ఉండే ఒక ధాన్యం… ఈ బార్లీ షుగర్ వ్యాధి నుంచి కూడా సమర్ధవంతంగా రక్షిస్తుంది.


బార్లీ గింజలను రాత్రి నీటిలో బాగా నానబెట్టి.. ఇక ఆ నీటిని పొద్దున్నే తాగడం వల్ల బార్లీలోని ఫైబర్ ని శరీరం బాగా స్వీకరిస్తుంది..అలాగే కిడ్నీని శుబ్రపరచడానికి కూడా బాగా ఊయపయోగపడుతుంది.పొటాషియం ఎక్కువగా ఉండే ద్రాక్ష, అరటి పండు, కమలఫలం, నారింజ, కీవీ ఇంకా అప్రికాట్ వంటి పండ్లను చాలా ఎక్కువగా తినాలి.. ముఖ్యంగా వివిధ రకాల బెర్రీస్ లను ప్రతి రోజూ కూడా తినాలి.. వీటిల్లో ఉండే క్వినైన్ మెటబాలిజం లో హిప్యురిక్ ఆసిడ్ గా మారడం జరిగి కిడ్నీలను బాగా శుభ్రపరచడం లో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది.అంతేగాక కిడ్నీల ఆరోగ్యం పై ప్రభావం చూపే ఆల్కహాల్, చాకోలేట్,ఇంకా కెప్ఫిన్ లకు చాలా దూరంగా ఉండాలి.. వీటి వల్ల కేవలం కిడ్నీలకే కాదు… మొత్తం శరీరం పై కూడా చాలా దుష్ప్రభావం కలుగుతుంది. వీటిని అరిగించే కరిగించే క్రమంలో కిడ్నీల పై కూడా ప్రభావం చాలా గట్టిగా పడుతుంది.. దీంతో కిడ్నీల పనితీరు అనేది తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: