బెండకాయలో ఇన్ని ఔషధ గుణాలున్నాయా..?

MOHAN BABU
బెండకాయ కూర అంటేనే  చాలామంది ఇష్టపడి తింటారు. ఈ బెండకాయలతో రకరకాల వంటలు కూడా తయారు చేస్తారు. బెండకాయ ఫ్రై, బెండకాయతో సాంబారు  చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే బెండకాయలు   అనేక రకాల  పోషకాలు కూడా కొలువై ఉన్నాయి.  క్యాన్సర్ మరియు మధుమేహం ఉన్న వారిలో ఈ బెండకాయను తింటే ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ బెండకాయలో విటమిన్ సి, విటమిన్ బి, పోలిక్ యాసిడ్ ఇంకా అనేక పోషకాలు ఉంటాయి. కాబట్టి బెండకాయ  మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరియు మధుమేహ వ్యాధి  ఉన్నవారికి ఈ బెండకాయ ఏ విధంగా ఉపయోగపడుతుంది తెలుసుకుందాం. బెండకాయ తినడం వలన ప్రారంభ దశలో  ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.


ఆరోగ్య నిపుణులు చేసిన పరిశోధనలో  బెండకాయ తినేవారిలో ఎక్కువగా చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయని తెలియజేశారు. టర్కీలో బెండకాయ విత్తనాలను చాలా సంవత్సరాలుగా  డయాబెటిస్ చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఈ బెండకాయలో ఫైబర్ అధికంగా  ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిని తగ్గించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా గ్లైసిమిక్, నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇన్సులిన్ ను కూడా  మెరుగుపరుస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన పొట్ట భాగం చాలాసేపు నిండినట్టు ఉంటుంది. ఆకలి ఎక్కువగా ఉండదు. అలాగే జీర్ణక్రియకు సంబంధించి ఉపశమనం లభిస్తుంది.


బెండకాయలు  యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వలన ఇది ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇది ఒత్తిడిని కంట్రోల్ లో ఉంచడానికి ఎంతో ఉపయోగం. మధుమేహ వ్యాధిగ్రస్తులు బెండకాయ ఎక్కువ తినడం వల్ల  కొల్లెస్టరాల్ నియంత్రించబడుతుంది. అందుకే మనం బెండకాయ తినడం వలన  ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మనకు మధుమేహ వ్యాధి నుంచి ఉప శమనం  లభిస్తుంది. కాబట్టి బెండకాయలో ఇన్ని విటమిన్స్ ఉన్నాయని ఆహార నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు  బెండకాయ ఎక్కువగా తినాలని వారు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: