ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Divya
మనం సాధారణంగా మన ఇంటి చుట్టూ ఉండే ఈ పూల మొక్క గురించి మనకి ఎక్కువగా తెలియదు. ఆ మొక్కలను మనం కేవలం అలంకరణ కోసం మాత్రమే పెంచుతూ ఉంటాము. అలా పెంచిన పూలమొక్కలలో బిళ్ళ గన్నేరు మొక్క కూడా ఒకటి. అయితే ఈ మొక్క వలన ఎన్ని ప్రయోజనాలు వున్నాయో తెలియక వదిలి పెడుతూ ఉంటాము. అయితే ఈ మొక్క గురించి పూర్తిగా తెలుసుకుందాం.

1). బిళ్ళ గన్నేరు మొక్క యొక్క ఆకులను బాగా నూరి, పేస్ట్ గా చేసి ఏదైనా గాయాలు, పుండ్ల పై రాస్తే అవి మానిపోతాయి.

2). మధుమేహం ఉన్న వారు ఈ మొక్క యొక్క వేర్లను బాగా ఎండబెట్టి, పొడిగా నూరి అందులో కొంచెం తేనె కలుపుకొని , పరగడుపున, రాత్రి వేళలో ప్రతిరోజు తీసుకుంటే షుగర్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.

3). ఈ మొక్క ఆకులు రసం తీసి, వాటిని రాత్రి వేళల పనుకునే ముందు, తాగడం వల్ల హైపర్ టెన్షన్ తగ్గుతుంది.

4). ఇక ఈ ఆకులను తీసుకొని ఒక కప్పు లో  మరిగించి, ఆ నీటిని తాగడం వల్ల  రక్తస్రావం కాకుండా ఉంటుంది.

5). మనకు దద్దుర్లు, ఎర్రగా పుండు అయిన చోట ఈ ఆకు రసం పట్టిస్తే, నొప్పి, మంట వంటివి తగ్గుతాయి.

6). బిల్వ గన్నేరు ఆకులను ఎండ పెట్టి బాగా పొడి చేసి, అందులోకి కొంచెం పసుపు కలుపుకుని, ముఖానికి పట్టించి నట్లయితే.. ముఖం మీద ఉంటే మొటిమలను మాయం చేస్తుంది.అంతేకాకుండా ముఖం మీద ఉండే ఎటువంటి మచ్చలు అయినా  కూడా తొలగిపోతాయి.

7). ఈమొక్కలలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు వల్ల క్యాన్సర్ వంటి రోగాల బారిన పడకుండా చూసుకుంటుంది.

ఇక చివరిగా ఈ మొక్క రసాన్ని  రోజూ తీసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి విముక్తి కలిగించుకోవచ్చు. నిత్యం కనిపించే ఈ మొక్కలు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూశారు కదా..! ఈ మొక్కను ప్రతి ఒక్కరు పెంచుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: