ఈ అలవాట్లు మానకపోతే చావు ఖాయం..

Purushottham Vinay
ఈ కాలంలో ఎప్పుడు ఎలాంటి జబ్బులు వస్తాయో చెప్పలేము. మనం తినే ఆహారం నుంచి అన్ని కల్తీనే. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ఇక ముఖ్యంగా ఈ అలవాట్లని మార్చుకోకపోతే ఖచ్చితంగా చనిపోవడం ఖాయం. ఇక అవేంటో తెలుసుకోండి.తగినంత నిద్ర పోకపోవడం.. మీరు కనుక సరిగ్గా నిద్రపోకపోతే మరుసటి రోజు చాలా అనారోగ్యంగా ఉంటారు. మంచి నిద్రను బాగా నిర్లక్ష్యం చేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలలో ఇది ఒకటని చెప్పాలి.ఇక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చూసినట్లయితే ప్రతిరోజూ కూడా కనీసం 8 గంటల పాటు నిద్రపోవాలి. లేదంటే చాలా రోగాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఇక జున్ను, మాంసం వంటి జంతు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. వీటిని ఎక్కువగా తినడం ధూమపానంతో సమానం.ఇక అటువంటి ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవడం నివారించడానికి బీన్స్ వంటి మొక్కల ప్రోటీన్లను మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

ఇక మీరు ఆఫీసుకు వెళ్లి రోజంతా కుర్చీ నుంచి లేవకుండా పనిచేస్తే అది ఖచ్చితంగా ధూమపానం కంటే పెద్ద డేంజర్ అని చెప్పాలి. ఊపిరితిత్తులు, రొమ్ము ఇంకా పెద్దప్రేగు వంటి వివిధ క్యాన్సర్‌లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అలాగే దీర్ఘకాలం డ్రైవింగ్ చేయడం కూడా చాలా ప్రమాదమే.ఇక ఖచ్చితంగా ప్రతి రెండు గంటలకు ఒకసారి నడవండి ఆ తరువాత మీ పనిని కొనసాగించండి.ఇక విటమిన్ డి అనేది మన శరీరానికి చాలా అత్యవసరం. విటమిన్ డి రోగనిరోధక శక్తిని పెంచే మంచి హెల్తీ విటమిన్‌.ఇక ఇంట్లో 24 గంటలు కూర్చోవడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే విటమిన్-డి లోపం అనేది సంభవించవచ్చు.కాబట్టి ఇక ఖచ్చితంగా ఈ అలవాట్లు గనుక ఉంటే వాటిని వెంటనే మార్చుకోండి.ఇక ఎలాంటి రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంగా కలకాలం జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: