ఉప్పు గురించి ఎవరికి తెలియని నిజాలు ఇవే..!

Suma Kallamadi
కూరల్లో ఉప్పుకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. ఉప్పు తక్కువ అయితే మళ్ళీ సరిపడా వేసుకోవచ్చు అదే ఉప్పు కనుక ఎక్కువ అయితే తినడం చాలా కష్టం. అయితే బీపీ ఎక్కువ ఉన్నవారు ఉప్పు తక్కువగా తినాలి. ఈ ఉప్పు మనకి సముద్రపు నీటితో తయారవుతుంది. అయితే ఉప్పును కేవలం రుచికోసం మాత్రమే ఉపయోగిస్తాం అంటే పొరపాటు పడినట్లే.ఉప్పు గురించి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. తెల్లగా ఉండి,  నీటిలో వెయ్యగానే కరిగిపోయే ఉప్పుతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు ఎక్కువ తింటే  హైబీపీ సమస్యలతో పాటు  ఎముకల సమస్యలు కూడా వస్తాయట.
ఉప్పు ఎక్కువగా తీసుకునే వారిలో గుండెజబ్బులు, ఒబేసిటీ, కిడ్నీ సమస్యలు, జీర్ణకోశ క్యాన్సర్‌ వంటి సమస్యలు వస్తాయి.  అలాగే ఉప్పు ఎక్కువగా తింటే  మెదడులో మంట, నొప్పి, దురదల వంటివి వస్తాయి.ఉప్పు గురించి శాస్త్ర వేత్తలు ఎలుకలపై చేసిన ప్రయోగాలలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి.  ఉప్పు ఎక్కువ తిన్న ఎలుకలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించినట్లు తెలిసింది. అదే ఉప్పు సరిపడా తిన్న ఎలుకలు మాత్రం సాధారణంగా ఉన్నట్టుగానే  పరిశోధనలో తేలింది. ఈ కాలంలో చాలామంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు.షుగర్ కంట్రోల్ లో ఉంచుకోవడం కోసం షుగర్ కంటెంట్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నారు.
ఒకవిధంగా చెప్పాలంటే షుగర్ ఎక్కువ తీసుకుంటే ఎంత ప్రమాదమో ఉప్పు కూడా అంతే అనే విషయం ప్రతి ఒక్కరు గమనించాలి. ఉప్పు వాడకాన్ని  కంట్రోల్ చెయ్యాలని  డబ్ల్యూ హెచ్ వోనే ప్రకటన చేసింది. అలాగే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన ఎన్ని సమస్యలు ఉన్నాయోఉప్పు వలన  అన్నే ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే  ఎప్పుడయినా గాని కుక్క కరిచిన వెంటనే అక్కడ ఉప్పు నీటితో కడగటం వలన ఇన్ఫెక్షన్లు తొందరగా రావు. ఏది ఎలా ఉన్నగాని ఉప్పు వాడకాన్ని తగ్గించుకుంటే బెటర్.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: