కోవిడ్ అనుకోని డెంగీతో చనిపోయిన డాక్టర్..

Purushottham Vinay
ప్రజలు ఇంకా ప్రభుత్వాలు కరోనా నివారణ పనుల్లో నిమగ్నమయ్యి సీజనల్ వ్యాధుల గురించి అసలు మర్చిపోయారు.ఇక వీటిల్లో డెంగీ జ్వరం ముఖ్యమైన ఇంకా ప్రాణాంతకమైన వ్యాధి. సాధారణంగా దీని వ్యాప్తి వానా కాలం ముగిసే సమయానికి మొదలవుతుంది.ఇక ఈ డెంగీ జ్వరం అనేది దోమల వల్ల కలిగే ఒక భయంకరమైన వైరల్ వ్యాధి. ఏడిస్ అనే పేరు గల దోమ కాటు ద్వారా డెంగీ వైరస్ మనుషులకు తొందరగా వ్యాపిస్తుంది.ఈ వ్యాధి శరీర అవయవాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. డెంగీ వ్యాధి బారిన పడినవారికి తేలికపాటి వ్యాధి లక్షణాలనేవి ఉంటాయి. అలాగే కొంతమందిలో ఎలాంటి లక్షణాలు అనేవి ఉండవు. డెంగీ వ్యాధి బారిన పడిన వారిలో 75 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తేల్చి చెబుతోంది. ఇక 20 శాతం మందిలో తేలికపాటి లక్షణాలు అనేవి ఉంటాయి.అలాగే మిగతా ఐదు శాతం మందిలో తీవ్రమైన లక్షణాలు అనేవి ఉండవచ్చు. అందుకే వీరిలో ఈ డెంగీ వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.

ఈ వ్యాధి ఎంత ప్రమాదకరమో తెలుసుకోడానికి ఇదే ఉదాహరణ.శ్రీలత వడ్లమూడి అనే డాక్టర్ చాల పేరున్న నెఫ్రోలోజిస్ట్  NRI హాస్పిటల్ లో నెప్రోలోజి డిపార్ట్మెంట్ హెడ్ గా ఆమె పనిచేస్తున్నారు.అంత పెద్ద స్టేజి కి రావటానికి ఆమె ఎన్నో ఎత్తుపల్లాలను ఎదురుకున్నారు.ఒక మద్యతరగతి అమ్మాయిగా ఆమె ఎన్నో అటుపోట్లను చూసింది.వారం రోజుల నుండి ఆమెకు జ్వరం. ఇక డాక్టర్లకు ఉండే సహజ నిర్లక్ష్యం ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం మీద నిర్లక్ష్యం. ఇక అదే నిర్లక్ష్యం తో కోవిడ్ అనుకొని కరోనా ట్రీట్మెంట్ తనకు తనే మొదలు పెట్టుకుంది.ఇక 'anti coaglulents' కుడా మొదలు పెట్టారు.ఇక ఆ రోజు తెల్లవారు జామున తీవ్ర రక్త స్రావం కావడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఇక అప్పటికే ఆమె బీపీ పడిపొయింది.ఇక ఆ తరువాత ఆమెకు అన్ని టెస్టులు చేశారు.ఇక చివరికి ఆవిడకి కోవిడ్ కాదు డెంగీ ఫీవర్ అని తెలీంది.కోవిడ్ ట్రీట్మెంట్ డెంగీ జ్వరానికి ఇస్తే ప్రాణాంతకం అవుతుంది.. ఇక ఇలా చాలా మంది ప్రయత్నాలు చేసారు బ్రతికించటానికి కానీ లాభం లేక పొయింది. ఇక ఇప్పుడు ఒక మంచి డాక్టరుని సమాజం కోల్పోయింది.అందుకే ఇప్పుడు చాలామందికూడా జ్వరం రాగనే కోవిడ్ అనుకొని టెస్టులు లేకుండా సొంత వైద్యం చేసుకుంటున్నారు..కరోనా మహమ్మారితో పాటు పాటు ఇప్పుడు డెంగీ ఫీవర్ ప్రమాదం కూడా చాలా ఎక్కువగా వుంది. కాబట్టి డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి సొంత వైద్యం చేయించుకోకండి. ప్రాణాలు పోగొట్టుకోకండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: