ప్రతి రోజూ స్నానం చేయడం మానస్తే..ఈ సమస్యలు తప్పువు ?

Veldandi Saikiran
ప్రతి మనిషి కి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే.. మని వ్యవహారాలు చక్కబడతాయి. అయితే... మనం ఆరోగ్యం గా ఉండాలంటే.. ముఖ్యంగా ప్రతి రోజూ స్నానం చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ మనం స్నానం చేయకపోతే.. అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అవేం టో ఇప్పుడు చూద్దాం.

ప్రతి రోజూ స్నానం చేయని చో మన గజ్జల్లో ఫంగస్‌, బ్యాక్టీ రియా జమ అవుతుంది.  దీంతో ఆ ప్లేసు ల్లో దురద ఏర్పడి... ఇన్‌ ఫెక్షన్‌ కు దారితీస్తుంది.  స్నానం ప్రతి రోజూ చేస్తే నే..  ఫంగస్‌, బ్యాక్టీరియా లకు చెక్‌ పెట్టవచ్చు.
 
నిత్యం స్నానం చేయక పోతే... మనకు స్కిన్‌ కు సంబంధించిన వ్యాధులు సోకుతాయి.  మన మృదువైన చర్మం పై బ్యాక్టీరియా మరియు దుమ్ము, దూళి తీవ్రంగా జమ అవుతాయి. అలాగే.. మన చర్మం పై దద్దర్లు, మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
 
నిత్యం స్నానం చేయటం కారణంగా మన చర్మం పైన ఉండేటు వంటి మృత చర్మ కణాలు బయటకు వెళ్లి పోతాయి. ఈని కారణంగా నూతనంగా చర్మ కణాలు ఏర్పడతాయి.  దీంతో మన కు ఎలాంటి వ్యాధులు సంక్రమించవు.
 
అదే.. మనం ఎప్పుడైతే.. స్నానం చేయడం మానేస్తే... మన శరీరం పైనే చర్మ కణాలు ఉండి పోతాయి. దీని కారణంగా శరీరమంతా మృత కణాలు ఉండిపోతాయి.  ఇలా శరీరమంతా మృత కణాలు  ఉండటం వల్ల... మనకు రోగాలతో పాటు.. శరీరమంతా దుర్వాసన వస్తుం ది.
 
అలాగే.. స్నానం చేయక పోవడం కారణంగా జలుబు మరియు హెపటైటిస్‌ లాంటి వ్యాధులు తొందరగా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ నిత్యం స్నానం చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.  కరోనా మహమ్మారి నేపథ్యం లో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్త గా ఉండాల్సిన అవసర ఉందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: