ఎముకలు బలంగా అవ్వాలంటే ఇవి తీసుకోవాల్సిందే..

Purushottham Vinay
మనం ఆరోగ్యంగా బలంగా దృఢంగా అవ్వాలంటే ఖచ్చితంగా మన బాడీతో పాటు ఎముకలు కూడా చాలా గట్టిగా ఇంకా బలంగా ఉండాలి. ఎముకలు గట్టిగా తయారవ్వాలంటే ఖచ్చితంగా మన బాడీకి కాల్షియం అందాలి. పాలల్లో కాల్షియం బాగా ఉంటుంది.పాలు ఎముకలకు మాములు బలం కాదు. అందుకే చిన్నప్పటి నుంచి చాలామంది పిల్లలకు రోజు కూడా గ్లాసు పాలు తాగడం అలవాటు చెయ్యాలి. ఇక అందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే పాలతో తయారయ్యే డైరీ ఉత్పత్తుల్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది.అలాగే తెల్లనువ్వులు లేదా నల్ల నువ్వులు ఈ రెండింటిలో కూడా అనేక రకాల పోషకాలు ఉంటాయి.  వీటిలో క్యాల్షియం కూడా చాలా అధికంగా ఉంటుంది. అందుకే రోజుకి టీస్పూను నువ్వులు డైట్‌లో చేర్చుకుంటే ఎముకలు దృఢంగా అవుతాయి. ఇక అవిసె గింజలు మన బాడీకి ఎముకలకి చాలా మంచివి. వీటిలో ఒమేగా–3 ప్యాటీ యాసిడ్స్ ఇంకా ప్రొటీన్ అలాగే పీచుపదార్థంతో పాటు క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.


రోజూ కూడా టీస్పూను అవిసె గింజల్ని సలాడ్‌పై చల్లుకుని తింటే బాడీకి ఇంకా ఎముకలకు కావాల్సిన క్యాల్షియం అందుతుంది.అలాగే గసగసాల్లో కూడా క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందులో క్యాల్షియం మాత్రమే కాదు మ్యాంగనీస్, ప్రొటీన్ ఇంకా పీచుపదార్థం కూడా ఉంటుంది. అందుకే గసగసాలు మనం తినే ఫుడ్‌లో ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.ఇక ఆకుకూరలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆకు కూరలు తినేటప్పుడు పలు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి.ముఖ్యంగా ఎలాంటి పురుగు మందులు వాడని ఆర్గానిక్ ఆకుకూరలు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటి వల్ల శరీరానికి ఇంకా ఎముకలకి కావాల్సిన అన్ని పోషకాలు దొరుకుతాయి.  ముఖ్యంగా మెంతికూర ఇంకా మునగాకుల్లో క్యాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని కూరలుగా లేదంటే ఎండబెట్టి తింటే క్యాల్షియంతోపాటు, యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ఖనిజపోషకాలు శరీరానికి అందుతాయి. ఇక శరీరం సాధారణ పనితీరుకు కూడా కాల్షియం అనేది చాలా అవసరం. కాబట్టి పాలు, పాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ ఖచ్చితంగా తీసుకోండి.సంపూర్ణ ఆరోగ్యంగా వుండండి. ఎముకలని బాగా దృఢంగా బలంగా ఉంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: