సూర్యకిరణాలతో ఆ కోరికలు.. షాకింగ్‌ నిజాలు ?

Veldandi Saikiran
మనిషి జీవితం లో శృంగారం అనేది చాలా ముఖ్యమైన అంశం. అంతేకాదు... ప్రతి మనిషికి శృంగారం అవసరం.  ఆరోగ్య వంతమైన శృంగారం కారణంగా వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.  అసలు విషయంలో వెళితే ... ఎండా కాలం లో సూర్య కిరణాలు మన చర్మం పై పడ్డప్పుడు...  సెక్స్‌ కోరికలు చాలా ఎక్కువగా పెరుగుతాయట. అయితే.. విషయాన్ని ఇజ్రాయోల్‌ దేశానికి చెందినటు వంటి..  ప్రముఖ శాస్త్ర వేత్తలు చేసిన  పరిశోధనల్లో తేలిందట.  అవును...సూర్య కిరణాలు మన చర్మం పై పడితే...  సెక్స్‌ కోరికలు పెరుగుతాయా ? లేదా ? అనే దాని  పై    ఇజ్రాయోల్‌ దేశానికి   శాస్త్ర వేత్తలు పరిశోధనలు చేశారు.  
అయితే... పరిశోధనల్లో షాకింగ్‌ విషయాలు బయట పడ్డాయి.  సూర్య కిరణాలు సెక్స్‌ కోరికలను పెంచుతాయని ఈ పరిశోధనలు తేల్చాయి.  సూర్య కిరణాలు మన బాడీ ని తాకినప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటు వంటి ప్రేమ, మరియు ఆప్యాయత పెరుగుతుందని ఈ శాస్త్ర వేత్తలు వెల్లడిస్తున్నారు. మన స్కిన్‌ లో ఉండేటు వంటి ప్రోటీన్‌ చేత సూర్య కాంతి వల్ల చర్మ డీఎన్‌ ఏ దెబ్బ తినకుండా ఉంటుందట. సూర్య కిరణాలు చర్మం పై పడితే...  p 53 అనే హార్మోన్లు మన శరీరం లో అనేక మార్పులకు నాంది పలుకుతాయట.  
మన శరీరం లో మరియు మనస్సు లో మార్పులకు దారి తీస్తాయని ఆ శాస్త్ర వేత్తలు వెల్లడిస్తున్నారు. మనుషుల్లో నూ కాదు.... ఇది జంతువుల్లోనూ ప్రభావం చూపుతోందంటున్నారు. ఈ సూర్య కిరణాల కారణంగా జంతువుల్లో నూ శృంగార కోరిక ను పెంచుతాయట.  అటు మనుషుల్లోనూ ముఖ్యంగా పురుషుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందట.  చర్మ క్యాన్సర్‌ పై  ఇజ్రాయోల్‌ దేశానికి   శాస్త్ర వేత్తలు పరిశోధనలు చేయగా.. వింతగా ఈ విషయం బయట పడిందట. మొత్తానికి సూర్య కిరణాల కారణంగా శృంగార కోరికలు పెరగుతాయని తాము ఈ పరిశోధనల ద్వారా తెలుసుకున్నామని వారు చెబుతున్నారు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: