బీర్లు ఎక్కువగా తాగుతున్నారా... ప్రమాదం ముందుంది ?
బీర్ ఏదో కొంచెం పరిమితంగా తీసుకుంటే ఓకె గానీ, అపరిమితంగా తీసుకుంటే మాత్రం నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. తాజాగా చేసిన ఒక అధ్యయనం ప్రకారం శృంగారంలో పాల్గొనే ముందు కొంత మంది మహిళలకు మరియు పురుషులకు బీర్ ను ఇచ్చారట. అయితే బీర్ తీసుకున్న తర్వాత మహిళలలో ఎటువంటి ఎఫెక్ట్ లేదని వీరు గమనించినట్లు తెలిసింది. అదే పురుషులలో మాత్రం బీర్ తాగిన తర్వాత శృంగార సామర్థ్యం పెరిగిందని ఈ అధ్యయనం తెలిపింది. అంతే కాకుండా నపుంసకులు బీర్ తీసుకుంటే ఆ ప్రభావం కొంతవరకైనా తగ్గుతుందని వీరు చెబుతున్నారు.
అయితే ఇక్కడ ఒక సంకటం ఏర్పడే ప్రమాదం ఉందని వీరు చెబుతున్నారు. నపుంసకత్వం సమస్య పూర్తిగా తొలగిపోవాలని ఎక్కువగా బీర్లు తాగితే మాత్రం అంగం స్థంభన సమస్య వచ్చే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం తెలుపుతోంది. కాబట్టి బీర్ ను చాలా పరిమితంగా మాత్రమే సేవించాలని చెబుతున్నారు. కాబట్టి యువకులు అందరూ ఆలోచించి బీర్ ను తక్కువగా మాత్రమే తాగండి. వీలైతే మానేయండి. మద్యం తాగడం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.