వయస్సు 30 దాటిందా..ఈ పరీక్షలు చేసుకోవాల్సిందే ?
30 సంవత్సరాలు దాటిన మహిళలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
కంప్లీట్ బ్లడ్ కౌంట్ : కంప్లీట్ బ్లడ్ కౌంట్... దీన్ని సిబిసి టెస్ట్ కూడా అంటారు. ఈ పరీక్ష చేసుకోవడం కారణంగా వైట్ బ్లడ్ సెల్స్ మరియు రెడ్ బ్లడ్ సెల్స్ మనకు తెలుస్తోంది. అలాగే రక్తహీనత మరియు రక్త క్యాన్సర్ వస్తుందా లేదా అనే విషయాలు కూడా మనకు ఈ రిపోర్టు ద్వారా తెలుస్తాయి. ముఖ్యంగా మహిళలు రక్తహీనత అనేది ఎప్పటినుంచో సమస్య. కాబట్టి మహిళలు ఖచ్చితంగా కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ చేసుకోవాలి.
లిపిడ్ ప్రొఫైల్ : లిపిడ్ ప్రొఫైల్ అనేది మహిళలకు చాలా ముఖ్యమైనవి. ఈ టెస్ట్ ద్వారా శరీరంలో కొవ్వు శాతం ఏ మేరకు ఉంది అనేదానిపై మనకు సమాచారం తెలుస్తుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉందా లేదా అనే విషయాన్ని కూడా ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చును. హాట్ స్ట్రోక్ మరియు గుండె ఆరోగ్యం వంటి సమస్యలను తొందరగా మనం గుర్తించవచ్చు.
థైరాయిడ్ ; ప్రస్తుత కాలంలో షుగర్ బీపీ ల తో పాటు థైరాయిడ్ కూడా అందరిని వేధిస్తోంది. ముఖ్యంగా ఈ థైరాయిడ్ సమస్య మహిళలను ఇబ్బంది పెడుతోంది. పది మంది మహిళలు ఉంటే అందులో ఒక్కరికి కచ్చితంగా థైరాయిడ్ ఎలా ఉంటుంది. నెలసరి సరిగా లేకపోవడం మరియు బరువు తగ్గడం, హెయిర్ ఫాల్ మరియు సంతాన సమస్యలు ఈ థైరాయిడ్ కారణంగా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క మహిళ థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలి.
రక్తంలో చక్కెర : 35 సంవత్సరాలు దాటిన మహిళలు ఎక్కువగా షుగర్ వ్యాధి బారిన పడతారు. ఎలాంటి లక్షణాలు కనిపించకుండా అనే ఈ షుగర్ వ్యాధి వస్తుంది. కాబట్టి 35 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ షుగర్ టెస్ట్ చేయించుకోవడం చాలా ఉత్తమం.