గుండె ఆరోగ్యం కోసం ఇలా చేస్తే సరి..!

Veldandi Saikiran
ప్రస్తుత కాలంలో గుండెకు సంబంధించిన సమస్యలు చాలా మందికి వస్తున్నాయి. పని భారం, ఒత్తిడి మరియు సరైన తిండి లేకపోవడం కారణంగా... చాలామందికి గుండె కు సంబంధించిన అనేక సమస్యలు వస్తున్నాయి. అయితే  కొన్ని టిప్స్ పాటిస్తే... గుండె సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
బరువు చెక్ చేసుకుంటూ ఉండాలి : అధిక బరువు ఉండటం కారణంగా అనేక సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా అధిక బరువు కారణంగా మన గుండెకు సంబంధించిన అనేక వ్యాధులు వస్తాయి. డయాబెటిస్ తో మొదలై గుండె సమస్యల వరకూ అలా చాలా వ్యాధులు మనకు వస్తాయి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా బరువును అదుపులో ఉంచుకునేలా చూసుకోవాలి.
వ్యాయామం చేయటం : నిత్యం ఎక్ససైజ్ అనేది చాలా ముఖ్యమైన అంశం. వ్యాయామం అనేది లేకపోతే మనిషి జీవితం వృధా. ప్రతిరోజు వ్యాయామం చేస్తే మనకు ఇలాంటి సమస్యలు రావు. ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధులు మన దరికి చేరవు. కాబట్టి ప్రతి రోజు వ్యాయామం చేయాలి.
ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం : మన నిత్య జీవితంలో ఫైబర్ అనేది ఇది కీలక పాత్ర వహిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మనకు ఎలాంటి వ్యాధులు సోకవు. ముఖ్యంగా హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఈ ఫైబర్ కాపాడుతుంది. అందుకే ఓట్ మిల్, బ్రౌన్ రైస్ మరియు బీన్స్ చాలా రకాల ఫైబర్ ఫుల్ న్యూ తీసుకోవాలి. వీటిని తీసుకుంటే హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ లాంటి వాటికి చెక్ పెట్టవచ్చును.
మంచి నిద్ర : మనిషి జీవితంలో  నిద్ర అనేది కచ్చితంగా ఉండాలి. కంటి నిండా నిద్ర ఉంటే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ మరియు డయాబెటిస్ లాంటివి తగ్గిపోతాయి.  నిత్యం ప్రతి మనిషి ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోవాలి. ఇలా చేస్తే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: