పిల్లలకు డైపర్లు వాడే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Purushottham Vinay
ఇక ఈ రోజుల్లో పిల్లలకు డైపర్ల వాడకం అనేది భారీగా పెరిగింది. అయితే ఈ డైపర్లు ఎలాపడితే అలా కనుక మీరు మీ పిల్లలకు వాడితే మీ పిల్లలకు చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం అనేది ఉంది. ఇక మరి పిల్లలకు డైపర్ ఎలా వాడాలి.. వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఇప్పుడు తెలుసుకోండి.ఇక పిల్లలకు బట్టతో చేసినవి ఇంకా డిస్పోజబుల్ డైపర్లు అందరూ వాడుతుంటారు.ఇక వీటిలో ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకోండి.. ఇక ఈ బట్టతో చేసిన డైపర్లు కనుక వాడితే విసర్జించిన మలమూత్రాలు అనేవి బయటికి వచ్చే అవకాశం ఉంది.ఇక డిస్పోజబుల్‎కు డైపర్లు వాడితే మాత్రం పర్యావరణానికి చాలా తీవ్రంగా హానిచేస్తాయి. ఇక ఇప్పుడు మనకు ఏం అర్థమవుతుంది అంటే పిల్లలకు బట్టతో చేసిన డైపర్ల వాడకమే చాలా ఉత్తమం.

ఇక ఈ బట్టతో చేసిన డైపర్లలో వాటర్ ప్రూఫ్ ఉన్న ప్లాస్టిక్‎ను వాడితే చాలా బాగుటుంది. ఇక ముఖ్యంగా బట్టతో చేసిన డైపర్లను ఇతర బట్టలతో అసలు కలపకుండా వేడినీటిలో ఉతికితే చాలా మంచిది.ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఇంకా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే పిల్లలు మల విసర్జన చేసిన డైపర్లను అసలు అలాగే బయటపడేయకూడదు. ఇక వారు యూరిన్ చేసిన తర్వాత వీలైనంత తొందరగా డైపర్ ని మార్చడం చాలా మంచిది.లేదంటే వారి చర్మంపై ఇన్ఫెక్షన్ సోకే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక పిల్లలకు డైపర్ ని వేయడానికి ముందు పౌడర్ ని కనుక వేయాలనుకుంటే.. వాటిని అసలు చేతితో వేయకూడదు.ఇక డిస్పోజబుల్ డైపర్ ని కనుక వాడితే పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ కాస్త ఆలస్యం అవుతుందని అనుకుంటారు కానీ ఇది ఎంతమాత్రం నిజం కాదు.కాబట్టి పిల్లలకు డైపర్లు వేసేముందు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించి వారికి ఈ డైపర్లు వెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: