మంచి నాణ్యమైన నిద్రని ఇలా పొందండి..!

Veldandi Saikiran
నిత్యం మనం ప్రతిరోజు 7 నుంచి 9 గంటల పాటు నిద్ర పోవడం చాలా శ్రేయస్కరం. మన ఆరోగ్యం బాగుండాలంటే కచ్చితంగా నిద్ర పోవాల్సి ఉంటుంది. నిద్ర లేకపోవడం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం పొంచి ఉంది. అయితే ప్రస్తుత జనరేషన్ లో చాలా మంది పని బిజీలో పడి నిద్ర తక్కువగా పోతున్నారు. మరి కొందరికేమో సరిగా నిద్ర పట్టదు. అయితే మంచి నిద్ర పోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో చూద్దాం.

సరైన దిండు : మనం నిద్ర పోయేటప్పుడు సరైన దిండును పెట్టుకోవాలి. దీని ద్వారా మంచి నిద్ర మనకు పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవేళ నిద్ర పట్టదు దిండును మార్చి పెట్టి పడుకోవాలి. అప్పుడు సరిగ్గా నిద్ర పడుతుంది.


స్లీపింగ్ పొజిషన్ : మనం నిద్ర పోయేటప్పుడు పడుకునే పొజిషన్... కరెక్ట్ ఉండాలి. పొట్ట అనుకుని మీరు నిద్రపోవడం అస్సలు మంచిది కాదు. పక్కకు తిరిగి పడుకున్న సరిపోదు. అందుకే మనం నిద్రించే డైరెక్షన్ చాలా ముఖ్యం.
మంచి పరుపు : మనం నిద్ర పోయేటప్పుడు పరుపు అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. కాబట్టి మనం నాణ్యమైన పరుపులు మాత్రమే వాడాలి. తద్వారా మనకు మంచి నిద్ర వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే నడుము మరియు భుజం నొప్పి లాంటి అస్సలు మనకు రావు.
లైట్స్ అన్నీ ఆపేయాలి : చాలామంది నిద్రపోయే సమయంలో లైట్లను ఆఫ్ చేయకుండా నిద్రపోతారు. దీని కారణంగా చాలా మందికి నిద్రలేమి సమస్య తలెత్తుతోంది. కాబట్టి మనం నిద్రపోయే గదిలో కచ్చితంగా లైట్స్ అన్ని ఆఫ్ చేయాలి. వెలుతురు లేకుండా చూసుకుంటే చాలా మంచిది. తద్వారా మనకు మంచి నిద్ర పట్టవచ్చు. ఈ టిప్స్ పాటిస్తే మనం ప్రతిరోజు మంచి నిద్ర ను పొంద వచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: