"ఫాస్ట్ ఫుడ్" కి స్వస్తి చెప్పండి... ఆరోగ్యాన్ని కాపాడుకోండి

VAMSI
ప్రస్తుత జనరేషన్ లో అందరూ కాలంతో పరుగులు తీస్తూ ఎప్పుడు బిజీగా ఉంటున్నారు. వారి బిజీ వేళల్లో తిండిపై కాస్త శ్రద్ధ కూడా పెట్టలేక పోతున్నారు. ఎంత సంపాదించినా ఆరోగ్యకరమైన తిండి లేకుంటే ఎందుకు వృధా. కాగా బయట ఫుడ్ కే ఎక్కువగా అలవాటు పడుతున్నారు. అవకాశం లేక కొందరు బయట ఫుడ్ కి అలవాటు పడుతుంటే, ఇంకొందరు ఇంట్లో చేసుకునేంత సమయం లేక బయట తిండ్లు తింటున్నారు. కానీ ఎప్పటికప్పుడు పెద్దగా ప్రమాదం కాక పోయినా ఈ అలవాటు భవిష్యత్తులో మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఫాస్ట్ ఫుడ్ ను అస్సలు తినకూడదు, కానీ చాలా మంది సాయంత్రం అయితే ఫాస్ట్ ఫుడ్ వైపు పరుగులు తీస్తున్నారు.

బయట పది మందికి చేస్తున్నారు అంటే క్వాలిటీ తగ్గుతుంది. రుచిగా ఉండొచ్చు కానీ, శుభ్రత, వంట నూనె, వాడే పదార్దాలు ఇలా అన్ని క్వాలిటీ తగ్గుతాయి. ఇవన్నీ తరువాత మన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి. ఎన్నో జబ్బుల బారిన పడటానికి ఇలా బయట ఆహారం తినడమే ప్రధాన కారణమని డాక్టర్లు చెబుతున్నారు. మనం సరే పిల్లలు కూడా పొద్దున లేస్తే టిఫిన్ లని, స్నాక్స్ అని ఇలా చాలా వరకు బయట ఫుడ్ తింటున్నారు. స్టాక్ చేసిన తిను బండారాలు తరచూ తినడం అలవాటుగా మారిపోయింది. ఈ పద్దతి ఇకనైనా మారాలి. మార్పు మన చేతిలోనే ఉంది.

భావి భవిష్యత్తు కోసం, ఆరోగ్యవంతమైన జీవితం కోసం ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అవసరం. ఒక్క సారిగా ఆహారపు అలవాట్లను మానేయడం కష్టం కావొచ్చు. కాని వీలైనంత వరకు మెల్లగా ఈ పద్ధతులను మార్చుకోవాలి.
అపుడే ఆరోగ్యం బాగుంటుంది.  అనారోగ్య సమస్యల బారిన పడకుండా వీలైనంత వరకు జాగ్రత్త పడవచ్చు. ఆకు కూరలను, ఉడికించిన కూర గాయలను ఎక్కువగా తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: