వాటర్ ఎక్కువగా తాగుతున్నారా.. అయితే జాగ్రత్త?
అయితే కొంతమంది శరీరానికి కావాల్సిన నీరు కంటే ఎక్కువ మోతాదులో నీరు తాగడం వంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ప్రతిరోజు ఇక శరీరానికి కావాల్సిన నీరు తాగడం మంచిదే. కానీ కాస్త ఎక్కువ అయితే మాత్రం అనర్ధాలకు కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే డాక్టర్లు సూచించిన విధంగా ఎక్కడా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నీరు తీసుకోవడం ఎంతో మంచిది అని చెబుతూ ఉంటారు. శరీరానికి మంచి జరుగుతుంది కదా అని మోతాదు కంటే ఎక్కువగా నీరు తాగితే మాత్రం ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే కేవలం నీరు విషయంలోనే కాదు ఏదైనా సరే మితిమీరితే ఆరోగ్యానికి చేటు చేస్తుందని నిపుణులు చెబుతూనే ఉంటారు. అలాగే నీరు శరీరం బాగా పని చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఎక్కువ తీసుకుంటే మాత్రం అధిక హైడ్రేషన్ కు దారితీస్తుంది అని చెబుతున్నారు నిపుణులు. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్ర విసర్జన కూడా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఇలా జరగడం వల్ల తొందరగా అలసి పోయే ప్రమాదం ఉంటుంది అని అంటున్నారు. అంతేకాదు నీరు మోతాదు కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల చేతులు పాదాలు పెదాలు కూడా వాపు వస్తుంది అంటున్నారు నిపుణులు. అంతేకాదు నీరు ఎక్కువ అయితే ఇక రక్తంలో సోడియం లెవెల్స్ పెరిగిపోయే అవకాశం కూడా ఉంది అంటున్నారు.