చరికాలంలో జుట్టు రక్షణకు.. వేడి నీరు మంచిదా.. లేక?

praveen
ఇటీవల కాలంలో జుట్టును కాపాడుకోవడం ప్రతి ఒక్కరికి పెద్ద సమస్యగా మారిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రాలిపోతున్న జుట్టు ని చూసి ఎంతో మంది నిరాశ చెందుతుంటారు. ఈ క్రమంలోనే స్నానం చేయడం విషయంలో కూడా ఎన్నో అనుమానాలు అపోహలు కలిగి ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో అయితే స్నానం అనేది ఒక పెద్ద టాస్క్ లాంటిది అని చెప్పాలి. స్నానం చేయాలి అంటేనే భయపడిపోతుంటారు. ఎందుకంటే స్నానం చేసిన తర్వాత మళ్లీ చలికి వణికి పోవాలి కాబట్టి. అదే సమయంలో ఇక జుట్టును కాపాడుకోవడానికి చలికాలంలో వేడినీటితో స్నానం చేస్తే మంచిదా లేకపోతే చన్నీటితో స్నానం చేస్తే మంచిదా అన్న విషయంపై మాత్రం చాలా మంది అయోమయంలో ఉంటారు.


 సాధారణంగా ప్రతి ఒక్కరూ నల్లటి ఒత్తయిన జుట్టు ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. కొన్ని అలవాట్లు, కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు, మరికొన్నిసార్లు జీన్స్ వల్ల కూడా జుట్టు రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే చలికాలంలో జలుబు రాకుండా ఉండేందుకు చాలా మంది చొప్పున వేడి నీళ్ళతో కడిగటం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే వేడి నీతితో కడుక్కోవడం వల్ల చలి పుట్టదు కానీ జుట్టు మాత్రం గరుకు గా మారిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి నీటితో జుట్టుని కడగండం వల్ల తీవ్రంగా జుట్టు బలహీనంగా మారుతుంది అని అంటున్నారు.


 అలా అనీ చన్నీటితో జుట్టు కడగటం కూడా అంత మంచిది కాదు అంటున్నారు. అందుకే శీతాకాలం సమయంలో జుట్టు సంరక్షణకు గోరువెచ్చని నీటితో కడగడం ఎంతో మంచిదని సూచిస్తున్నారు. గోరు వెచ్చని నీటిలో జుట్టు కడగటం వల్ల జుట్టుకు పెద్దగా నష్టం వాటిల్లదు అంటున్నారు నిపుణులు. చలికాలంలో జుట్టును కడుక్కునేటప్పుడు షాంపూ తో జుట్టు పై ఎక్కువసేపు ఉంచకూడదు అంటూ సూచిస్తున్నారు.  చలికాలంలో ఎక్కువ సమయం పాటు జుట్టును కడుక్కోవడం వల్ల ఇక వెంటనే జట్టు అడుగు భాగంలో ఉండే సహజమైన నూనె తగ్గిపోతుంది అని అంటున్నారు నిపుణులు. ఇలా చలికాలంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని జుట్టుని కాపాడుకోవాలి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: