దేశంలో కరోనా వైరస్ ప్రభావం తో ఇప్పటికే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కనీసం తిందామంటే తిండి లేక ఎన్నో అవాంతరాల మధ్య ప్రస్తుతం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మళ్లీ థర్డ్ వేవ్ తీవ్రంగా విరుచుకు పడుతోంది. మరి ఒక్క రోజు లో ఎన్ని కేసులు నమోదు అయ్యాయో తెలుసుకుందాం..?
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వచ్చే రెండు వారాల్లో కరోనా మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కరోనా లక్షణాలు ఉన్న వారంతా హాస్పిటల్ కి వచ్చి పరీక్షలు చేయించు కుంటున్నారు. కింగ్ కోటి ఆస్పత్రిలో టెస్టుల కోసం జనాలు క్యూ కట్టారు. ఇక్కడే కరోనా ట్రీట్మెంట్ ప్రారంభించబోతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రమంతా అలర్ట్ అవుతుంది. ఇప్పటికే తెలంగాణలో తాజాగా మూడువేల కరోనా కేసులు నమోదవడంతో పాటు లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరు టెస్టింగ్ సెంటర్ కి వెళ్లి టెస్ట్ చేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందుగానే టెస్ట్ చేసుకొని అలర్ట్ అవ్వడం ముఖ్యమని చాలా మంది అవగాహనకు వచ్చారు.
మరో రెండు వారాల్లో కరోనా విపరీతంగా పెరిగిపోతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. కేసులు పెరిగే నేపథ్యం ఉన్నందున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవాలని వైద్యాధికారులు,వైద్య సిబ్బంది సూచిస్తున్నారు. కరోనా కు సంబంధించి గాని, ఓమిక్రాన్ కి సంబంధించి గాని ఏ ఒక్క లక్షణం కనిపించినా వెంటనే టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వచ్చే రెండు వారాల్లో రాష్ట్రంలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున, దీనికి సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే శానిటైజర్, మాస్క్ ధరించాలి. ఎక్కువ రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వెళ్లకుండా,అవసరమైనప్పుడే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలనేది చాలా ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పవచ్చు. కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి మొదటి డోసు 100% ముగిసిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.