వామ్మో: మగవారికి మాత్రమే వచ్చే రోగాలు ఏంటో తెలుసా..?
బట్టతల:
బట్టతల అనేది ఒక వ్యాధా అనే విషయానికి వస్తే.. ఇది వ్యాధి కాకపోయినా ఒక సమస్యగా పరిగణించవలసిన వుంటుంది అమ్మాయిలకు మరి జుట్టు ఊడిపోదా అనే సమస్య ఎదురైతే కచ్చితంగా ఊడిపోతుందని చెబుదాము.. ఆడవారికి బట్టతల వస్తుందన్నట్లు ఎక్కడ పరిగణించలేదు. ముఖ్యంగా మగ వారికి మాత్రమే ఈ బట్టతల సమస్య వస్తుంది. అయితే కొంతమందిలో తండ్రి నుంచి కొడుకుకు కూడా వారసత్వంగా కూడా ఈ బట్టతల రావడం గమనార్హం.
పెరోనిజ్ :
ఇది అతి పెద్ద సమస్య కాకపోయినప్పటికీ ఇది కూడా తండ్రి నుంచి కొడుకు వారసత్వంగా వస్తుంది అన్నమాట.. అయితే ఈ పెరోనిజ్ సమస్య అంటే ఏమిటి అనే విషయానికి వస్తే.. మగవారి పురుషాంగం ఎడమవైపు కి కొంచం వంగి ఉంటుంది.ఎంతలా వంగుతుంది అంటే..మగ వారు శృంగారం చేయడం కూడా కష్టంగా భావిస్తారు. అంతే కాకుండా పురుషాంగం సైజు కూడా బాగా తగ్గిపోతుంది. ఇక అంగస్తంభనల గురించి అయితే ఇక మరిచి పోవాల్సిందే.
ఆల్పోర్ట్ సిండ్రోం :
పురుషులలో చాలా అరుదుగా కనిపించే సమస్య అయినా ఈ సమస్య వస్తే మాత్రం కచ్చితంగా మగవారి ప్రాణాలను తీస్తుంది. ఇక ఈ సమస్య వచ్చినప్పుడు కళ్ళు, చెవులు, కిడ్నీలు క్రమక్రమంగా పనిచేయడం ఆగిపోతాయి. అయితే పురుషుల లోనే ఈ సమస్య వస్తుందా అంటే ఆడవారిలో X క్రోమోజోమ్ లు రెండు ఉంటాయి.. కానీ మగవారిలో X క్రోమోజోములు ఒకటే ఉండడం వల్ల ఇలాంటి సమస్య తలెత్తుతుంది అని వైద్యులు సూచిస్తున్నారు.
ఇక వీటితో పాటు..టెస్టికులర్ క్యాన్సర్ వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం కేవలం మగవారికే ఉంది.