కలవరపెడుతున్న మరో సరికొత్త బీఏ.2 వేరియంట్.. డబ్ల్యూహెచ్ఓ ఏమన్నదంటే..!!

Divya
ఇప్పటికే గత రెండు సంవత్సరాల నుంచి కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ముప్పతిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే. ఇక సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ మరో కొత్త వేరియంట్ ఇప్పుడు చాలా టెన్షన్ పెడుతున్న సమయంలో.. సరి కొత్తగా కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరో బీఏ 2వేరియంట్ పలు దేశాలకు వ్యాపించి కునుకులేకుండా చేస్తోంది.. తాజాగా వచ్చిన ఈ వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. తాజాగా ఈ వేరియంట్ పై నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 60 దేశాలకు ఈ కొత్త వేరియంట్ సోకిందట.

ఒమిక్రాన్  వేరియంట్ కన్నా ఇది రెట్టింపు స్పీడులో ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది అని డబ్ల్యుహెచ్వో ప్రజలకు వార్నింగ్ కూడా ఇస్తోంది.. ఈ వేరియంట్ కూడా సౌత్ ఆఫ్రికా లోని సుమారుగా పది వారాల క్రితం వెలుగు చూసిందని చాలా తక్కువ సమయంలో సుమారు 57 దేశాలకు పాకి అందర్నీ ఆందోళనకు గురి చేస్తోందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.బీఏ.1, బీఏ.1.1, బీఏ.2 మరియు బీఏ.3. రకానికి చెందిన ఎన్నో వేరియంట్లు నిర్మించబడినట్లు డబ్ల్యుహెచ్వో పరిశోధనలో తేలింది.. అయితే బీ ఏ 2 సబ్బు వేరే అంటూ ప్రస్తుతం ఉన్న వేరియంట్  ఒమిక్రాన్ కంటే ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వెళ్లడయిందట.

ఇకపోతే కొత్త వేరియంట్ ఇమ్యూనిటి నుంచి సులభంగా తప్పించుకునే అవకాశం కూడా లేకపోలేదు అని అందుకే ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. అయితే ఈ కొత్త వేరియంట్ మానవ కణాలలో కి ప్రవేశించడానికి అనేక ఉత్పరివర్తనాలు కలిగి ఉండే స్పష్టమైన పెరుగుదల కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొనడం జరిగింది కాబట్టి మరో కొత్త వేరియంట్ వస్తున్న నేపథ్యంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిస్తోంది డబ్ల్యు.హెచ్.ఓ సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: