దేశంలోని ఆసుపత్రుల్లో
కరోనా వైరస్ మహమ్మారి మరణాలు వాటికి గల కారణాలను తెలుసుకోవడానికి 37 ఆసుపత్రులలో చేరిన
కరోనా రోగులపై ఒక అధ్యయనం అనేది జరిగింది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఈ గణాంకాలను విడుదల చేయడం జరిగింది. ఇక దీని ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని
కరోనా సోకిన రోగులలో 22 శాతం మంది మరణించడం జరిగింది.ఇక ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ మాట్లాడుతూ.. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే
కరోనా థర్డ్ వేవ్ వచ్చిందన్నారు.
కరోనా రోగులపై చేసిన అధ్యయనంలో టీకాలు వేసిన వారు ఆసుపత్రిలో చేరినట్లు వారు కనుగొన్నారు.ఇక వారిలో మొత్తం 10.20 శాతం మంది చనిపోయారు. వీరిలో 91 శాతం మందికి
కరోనా వైరస్ రాకముందు కొన్ని తీవ్రమైన జబ్బులు ఉన్నాయి. అదే టైంలో టీకాలు వేయని వారిలో ఆసుపత్రిలో మరణాల రేటు 21.80 శాతంగా నమోదైంది.డాక్టర్ భార్గవ తెలిపిన వివరాల ప్రకారం..
కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం యువకులపై కనిపించింది.
డెల్టా వేరియంట్‌తో బాధపడుతున్న రోగులలో మొత్తం 66.1 శాతం మందికి ముందుగా కొన్ని వ్యాధులు ఉన్నాయని, అయితే ఒమిక్రాన్ రోగులలో మాత్రం 45.80 శాతం మందికి మాత్రమే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని అధ్యయనంలో తేలింది. జ్వరం ఇంకా అలాగే దగ్గు డెల్టా వల్ల కలిగే అత్యంత సాధారణ లక్షణాలు. అయితే ఒమిక్రాన్ గొంతు నొప్పి యొక్క ప్రధాన లక్షణంగా ఇక్కడ చెప్పవచ్చు.కరోనా థర్డ్ వేవ్‌లో రెండు డోస్‌లు వ్యాక్సిన్ తీసుకున్న వారికి
ఆక్సిజన్ అవసరం చాలా వరకు తగ్గిందన్నారు. ఆసుపత్రుల్లో చేరిన రోగులలో మొత్తం 36.10 శాతం మందికి
ఆక్సిజన్ అవసరమైందని తెలిపారు. ఈ వ్యక్తులు రెండు డోసులను తీసుకున్నారు. టీకా తీసుకోని రోగులలో మొత్తం 45.50 శాతం మందికి
ఆక్సిజన్ థెరపీ అవసరమైంది.అలాగే టీకాలు వేసిన రోగులలో, 5.4% మందికి వెంటిలేటర్ మద్దతు అవసరమైంది.కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారిలో 11.20 శాతం మంది వెంటిలేటర్ సపోర్టుపై ఉన్నారు. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా
కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ఐసీఎంఆర్ తెలిపడం జరిగింది. అయితే కేరళలో పెరుగుతున్న
కరోనా కేసులు ఇప్పటికి కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.