ఈ 4 ఆహార పదార్ధాలతో సన్నగా అవ్వండి... ?
బాదం పప్పు
బరువు తగ్గడానికి బాదం పప్పు బాగా ఉపయోగపడుతుందని వీరు అంటున్నారు. బాదం పప్పులో ఉండేటటువంటి పీచు పదార్ధం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. న్యూట్రీషియన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మరియు ప్రోటీన్స్ అధికంగా ఉండుట వలన బాదం బరువు తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. బాదం నమిలి తినటం వలన రిలీజ్ అయ్యే ఫ్యాట్స్ కడుపు నిండిన భావనను కలిగిస్తాయి తద్వారా పెద్దగా ఆకలి అనిపించదు.
కీర దోస
కీర దోస కూడా శరీర బరువును బాగా తగ్గిస్తుంది. ఇందులో నీటి శాతం అధికంగా అలాగే కేలరీలు తక్కువగా ఉండుట ఇవి శరీర బరువు తగ్గడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కనుక ప్రతి రోజు ఎదో ఒక సమయంలో ఈ కీర దోసను తినటం అలవాటు చేసుకుంటే బరువు తగ్గించుకోవచ్చు.
పెరుగు
పెరుగు కూడా బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే కాల్షియమ్ కొలస్ట్రాల్ మీద తన ప్రభావాన్ని చూపి బరువు తగ్గేలా చేస్తుంది. రోజులో కనీసం ఒకసారైనా పెరుగును తీసుకువడం వలన అనేక లాభాలు ఉన్నాయి.
ఇంకా ఇవి మాత్రమే కాకుండా పుట్ట గొడుగులు, పుచ్చకాయ వంటివి కూడా శరీర బరువు తగ్గటానికి తోడ్పడతాయి.
వీటితో పాటుగా వ్యాయామం మరియు వాకింగ్ వంటివి కుడా చేయడం వలన శరీర బరువు తగ్గడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.