అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే వంటింటి పదార్థాలు ఇవే..!!
అల్లం:
అల్లం మనం చేసుకునే వంటల్లో ఉపయోగించడం వల్ల కడుపులో టాక్సిన్స్ ను తొలగించి, కడుపులో జీర్ణ ఎంజైమ్ ల స్రావాన్ని పెంచడానికి అల్లం సహాయపడుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడానికి అల్లం చాలా బాగా పనిచేస్తుంది . అంతేకాదు అల్లం తో తయారు చేసుకునే టీ తాగడం వల్ల జలుబు, సైనస్ వంటి సమస్యలు దూరమవుతాయి.
దాల్చిన చెక్క:
దాల్చిన చెక్కలో యాంటీ వైరల్ లక్షణాలు ఉండటం వల్ల గెలుపుకు కారణమైన వైరస్ తో పోరాడి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే ఇన్ఫ్లమేటరీ గుణాలు వల్ల ఇలాంటి సమస్యలు దూరమవుతాయి.
జీలకర్ర:
జీలకర్రలో వుండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వల్ల గ్యాస్ బయటకు పంపి జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది.
కొత్తిమీర:
కొత్తిమీర ఆకలిని పెంచి, కడుపులో నులి పురుగులను నాశనం చేస్తుంది.
కలబంద:
కలబంద జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . జీర్ణ వ్యవస్థను బలోపేతం చేసి కడుపు నొప్పి , తిమ్మిరి వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు కలబంద చర్మసౌందర్య ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు.
పసుపు :
భారతీయ వంటకాలలో పసుపు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యతను సంతరించుకుంది. రోగనిరోధక శక్తి ని పెంచడమే కాకుండా కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. కీళ్ళనొప్పులు కూడా దూరమవుతాయి.