బంపర్ ఆఫర్.. రెండు పరోటాల తింటే లక్ష బహుమతి?

praveen
ఇటీవల కాలంలో ఎన్నో రెస్టారెంట్లు బిజినెస్ పెంచుకోవడానికి కాస్త వినూత్నంగా ఆలోచనా చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఊహించని రీతిలో ఆఫర్లతో తెర మీదికి వస్తు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారూ. ఏకంగా భారీ మొత్తంలో ప్రైజ్ మనీ ప్రకటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.. ఇటీవలి కాలంలో బాహుబలి బిర్యాని, ఏకంగా పది అడుగుల దోష లాంటి ఆఫర్లు సోషల్ మీడియాలో ఎంత హాట్ టాపిక్ గా మారిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఇక ఇప్పుడు ఇలాంటి ఒక ఒక ఆఫర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకవేళ మీకు పరోటాలు తినడం ఇష్టం అయితే కేవలం రెండే రెండు పరోటాలు తిరిగి లక్ష రూపాయలు బహుమతిగా పొందవచ్చు. అంతేకాదండోయ్ ఇక జీవితాంతం మీకు పరోటాలు ఉచితంగా పొందవచ్చు. జైపూర్లోని ఒక రెస్టారెంట్ ఇలాంటి ఒక వినూత్నమైన ఆఫర్ను పెట్టింది. న్యూ సంగంనేర్ రోడ్ లో ఉన్న జైపూర్ పరోటా జంక్షన్ కస్టమర్లను ఆకర్షించడానికి విచిత్రమైన ఆఫర్ పెట్టారు. తమ రెస్టారెంట్లో 32 అంగుళాల సైజులో రెండు పోరాటాలను గంటలో తింటే లక్ష రూపాయల బహుమతి పొందవచ్చు అంటూ ఆఫర్ పెట్టారు.



 తాము ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసిన వారికి జీవితాంతం పరోటాలను ఉచితంగా ఇస్తామని చెప్పారు. అయితే ఈ రెస్టారెంట్లో 72 రకాలకు పైగా 32 అంగుళాల పరోటాలు దొరుకుతాయి. బంగాళదుంప ఉల్లిపాయ పన్నీర్ సహా అనేక రకాల పరోటాలు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. ఇక లక్ష రూపాయల బహుమతి ప్రకటించిన పరోటాను ఏకంగా అయిదు అడుగుల ప్రత్యేకమైన పాన్ పైన తయారు చేస్తారు. దీనికోసం 20 రకాల ప్రత్యేకమైన మసాలాలు కూడా ఉపయోగిస్తారు ఇక ఏకంగా రెండు కిలోల పిండి ఒక పరోటా కోసం ఉపయోగిస్తారు. ఒకవేళ మీరు ఈ ఛాలెంజ్ లో పాల్గొనాలి అనుకుంటే మాత్రం జైపూర్ వెళ్లాల్సిందే సుమీ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: