మంచి నిద్రలో ఉన్నప్పుడు కొందరిలో ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో కొందరు బాగా గురక కూడా పెడుతుంటారు. దీనినే స్లీప్ అప్నియాగా అంటారు. అయితే ఇది చాలా సాధారణమైన విషయం అని చెప్పాలి. మనలో చాలా మందికి కూడా ఈ సమస్య ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సమస్య మరీ జఠిలంగా కూడా మారుతుంది. గుండె పనితీరు ఒక్కసారిగా ఆగిపోయే ప్రమాదం కూడా చాలానే ఉంటుంది. ఈ సమస్య తీవ్రతను బట్టి వ్యాధిని.. అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, సెంట్రల్ స్లీప్ అప్నియా ఇంకా కాంప్లెక్స్ స్లీప్ అప్నియా అని మూడు రకాలుగా విభజించారు. వీటిలో అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా శ్వాస సంబంధిత వ్యాధులకు పూర్తిగా దారి తీస్తుంది.ఈ వ్యాధితో బాధపడే వారు నిద్రిస్తున్న సమయంలో వారి ఎగువ వాయు నాళాలు కుచించుకుపోతాయి. దీంతో శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది అనేది వారికి ఏర్పడుతుంది. ఈ కారణంగా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు అనేవి వాళ్లకు తగ్గిపోయతాయి. కొన్ని సందర్భాల్లో గురకకు ఇదే ప్రధాన కారణంగా మారుతుంది.
ఇక కొంతమందిలో అయితే కొద్ది క్షణంపాటు శ్వాసతీసుకోవడం అనేది ఆగిపోతుంది. అయితే శ్వాసకోశ కేంద్రాలు మళ్లీ యాక్టివ్ కాగానే ఒక్కసారిగా శ్వాసకోవడం అనేది ప్రారంభిస్తారని.. న్యూఢిల్లీలోని PSRI హాస్పటల్ కి చెందిన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నీతూ జైన్ తెలిపారు. అంతేకాకుండా ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ఈ వ్యాధితో బాధపడేవారికి నిద్ర అనేది కూడా సరిగా ఉండదని, కొన్ని సందర్భాల్లో అయితే ఇది ప్రాణాంతకంగా కూడా మారొచ్చని చెప్పుకొచ్చారు.ఇక ఓఎస్‌ఏ వ్యాధి రావడానికి చాలా కారణాలు అనేవి ఉన్నాయి. అయితే వీటిలో ప్రధానమైన వాటిలో అధిక బరువు సమస్య ఒకటి. బరువు ఎక్కువ ఉన్నవారిలో (పొట్ట) శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ కారణంగా కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడం అనేది ఆగిపోతుంది. దీంతో వారి మెదడు ఒక్కసారి శరీరాన్ని అలర్ట్ చేసి నిద్ర నుంచి వారిని మేలుకొలుపుతుంది. ఇక అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కలగడానికి వయసు మీరడం, శ్వాసకోశసమస్యలు ఇంకా అలాగే వాయుమార్గం ఇరుకుగా ఉండడం ఇంకా అలాగే అనారోగ్యకరమైన జీవనశైలి కూడా కారణాలుగా చెప్పవచ్చు.