చికెన్ 65కి.. అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే షాకే?

praveen
చికెన్ 65.. ఈ పేరు చెప్పగానే మాంసాహార ప్రియులకు నోరూరిపోతుంది ఎందుకంటే చికెన్ లో ఎన్నో రకాల వంటకాలు ఉన్నప్పటికీ చికెన్ 65 మాత్రం మాంస ప్రియులకు ఎంతో ప్రత్యేకం అనే చెప్పాలి. ఇక ఏ హోటల్ కి వెళ్ళిన రెస్టారెంట్ కి వెళ్ళినా మాంసాహార ప్రియులు ఆర్డర్ ఇచ్చేది చికెన్ 65. అద్భుతమైన టేస్ట్ కలిగిన  ఈ వంటకాన్ని తింటూ మైమరచిపోతూ ఉంటారు మాంస ప్రియులు. అయితే  చికెన్ 65  కూ ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు ఉంది. కానీ మనదేశంలో మాత్రం మరింత ఫేమస్. కాస్త ఎక్కువగానే   తినేస్తుంటారు. అయితే ఇప్పుడు వరకు హోటల్ కి వెళ్లడం చికెన్ 65 కావాలి అంటూ ఆర్డర్ చేయడం వచ్చిన ఆర్డర్ను హాయిగా ఆరగించడం మాత్రమే మనకు తెలుసు.


 కానీ నోరూరించే ఈ వంటకానికి ఇలాంటి పేరు ఎలా వచ్చింది అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. కానీ అందరికీ ఈ డౌటు ఎప్పుడో ఓసారి వచ్చే ఉంటుంది. దీనికి ఆన్సర్ ఎవరు చెబుతారులే అని ఊరుకొని ఉంటారు అందరూ. కానీ ఇటీవలే రామ్ టేకే అనే ఒక ఇంస్టాగ్రామ్ యూజర్ వీడియో ఓ ద్వారా అందరి డౌట్ క్లియర్ చేసేసాడు. ఇటీవలే సదరు వ్యక్తి మాట్లాడుతూ తొలిసారిగా చికెన్ 65 పేరు ఎలా తెరమీదికి వచ్చింది అని చెప్పుకొచ్చాడు. చెన్నైలోని బుహరి హోటల్లో 1965లో ఈ డిష్ ప్రిపేర్ చేశారట. ఇలా 1965 లో మొట్టమొదటి సారిగా ఈ నోరూరించే డిష్ తయారు చేశారు కాబట్టి దీనికి చికెన్ 65 అని పేరు పెట్టారట.


 ఇంతకీ ఈ బుహరి హోటల్ ఎవరిది అని అనుకుంటున్నారా... ఏఏం బహురి అనే ఒక చెఫ్ 1951లో ఈ హోటల్ ని స్థాపించాడు. ఇక్కడ చికెన్ తో ఒక సరికొత్త వంటకాన్ని తయారు చేయగా.. అది 1965లో తయారు కావడంతో దీనికి  తయారైన  సంవత్సరం పేరు జోడిస్తూ చికెన్ 65 అని పేరు వచ్చింది. చికెన్ 65 కి పేరు ఎలా వచ్చిందో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి. ఏదేమైనా ఇన్ని రోజుల వరకు హాయిగా చికెన్ 65 వంటకాన్ని ఆరగించిన మాంస ప్రియులందరికీ కూడా ఇన్ని రోజుల నుంచి ఈ డిష్ కి ఈ పేరు ఎలా వచ్చింది అన్న డౌటు క్లారిఫై అయిపోయింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: