శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. వెంటనే ఫోన్ పక్కన పెట్టండి?

praveen
ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ఫోన్ ఒక భాగంగా మారిపోయింది. కాదు కాదు స్మార్ట్ఫోనే జీవితం గా మారిపోయింది. ఎందుకంటే నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ నుంచి తల పక్కకు తిప్పుకొలేకపోతున్నారు ఎంతోమంది. ఎంతపని ఉన్నా ఏం చేస్తున్నా అరచేతిలో మాత్రం స్మార్ట్ఫోన్ ఉండాల్సిందే. అంతలా మనిషి అవసరాలను తీర్చడానికి వచ్చిన స్మార్ట్ఫోన్ మనుషులనే బానిసలుగా మార్చుకుంది. ప్రస్తుత ఆధునిక యుగంలో ఏం కావాలన్నా అటు అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే దొరుకుతూ ఉండటంతో ఇక మిగతా ప్రపంచంతో ఎవరికీ పనిలేకుండా పోయింది. కేవలం స్మార్ట్ఫోన్ ప్రపంచంలోనే అందరూ బ్రతికేస్తున్నారు.


 అంతా బాగానే ఉంది కానీ స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతున్నాయ్ అన్నది విషయం తెలిసిందే. ఇలా ఇటీవల కాలంలో మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీయడంలో స్మార్ట్ఫోన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలోనే  శరీరంలో కొన్ని లక్షణాలు కనిపించాయి అంటే చాలు అదే ప్రమాద సూచికగా భావించి వెంటనే  స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టాలని  నిపుణులు సూచిస్తున్నారు. ఇక అలాంటి లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

 మొబైల్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగిపోతుంది. క్రమంగా ఇది కంటిచూపును దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది. ఇక మనిషి శరీరంలో అతి సున్నిత భాగమైన కంటిపై ఫోన్ బ్లూ లైట్ పడటంతో ఇక కంటి చూపు దెబ్బతింటుంది. అట కంటి నొప్పి తలనొప్పి కళ్ళు పొడి బారడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఫోన్ పక్కన  పెట్టాలట.


 ఇక ఏదైనా వస్తువులు పట్టుకున్నప్పుడు మణికట్టు నొప్పి వస్తే అది ఎక్కువగా ఫోన్ వాడకం వల్లే వచ్చిందని అర్థం చేసుకోవాలట. ఎలక్ట్రానిక్ వస్తువుల ఫోను ఎక్కువగా పట్టుకొని ఉండటం వల్ల తీవ్ర నొప్పి లాంటివి వస్తాయట. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఫోన్ పక్కన పెట్టాలని అంటున్నారు నిపుణులు.


 ఇక ముఖంపై ఎక్కువగా మొటిమలు రావడానికి కూడా ఫోన్ కారణమవుతోందని అంటున్నారు కొంతమంది నిపుణులు. ఫోన్ మొబైల్ స్క్రీన్ నుంచి హానికరమైన కిరణాలు ముఖంపై పడతాయని తద్వారా పగుళ్లు మచ్చలు మొటిమలు వస్తాయని ఇది అకాల వృద్ధాప్యాన్ని కూడా కారణం అవుతాయని అంటున్నారు.

 ఇక ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి నిద్ర ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మొబైల్ వాడకం పెరిగిపోవడంతో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. తద్వారా కొన్ని రోజుల్లోనే తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు.


 ఇక ఫోన్ లో ఏదైనా ఎక్కువగా చదవడం చూడటం చేస్తే ఒత్తిడి పెరిగి నిద్రలేమి సమస్య వస్తుంది. అంతే కాకుండా  ఇక జ్ఞాపకశక్తి తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఫోన్ ని పక్కన పెట్టడం బెటర్ అని అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: