తేనె అధికంగా తింటే కలిగే నష్టాలు ఏమిటో తెలుసా..?

Divya
సాధారణంగా కొన్ని కొన్ని ఆహార పదార్థాల వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినా..వాటి వల్ల కొన్ని కొన్ని సందర్భాలలో నష్టాలు కూడా కలుగుతాయని ఇటీవల కాలంలో చాలామంది తెలుసుకోగలుగుతారు. సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో చేతివేళ్ల లోని అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని కూడా చూడగలుగుతున్నారు. ఇక అలాంటి వాటిలో కూడా ఆహార పదార్థాలను మితంగా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అవే ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని అని ఇప్పుడు ఎక్కువగా వార్తలు ప్రచురితమవుతున్నాయి. అలాంటి వాటిలో తేనె కూడా ఒకటి. ఇక ఈ తేనే ఎక్కువగా తినడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనే విషయం తెలుసుకుందాం.

1. అధిక బరువు:
తేనె అధికంగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే చక్కెర కన్నా ఎక్కువ శాతం తీపిని కలిగి ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం పైగా కొలెస్ట్రాల్ రూపంలో పేరుకుపోవడంతో అధిక బరువు పెరిగే అవకాశం ఉంటుం దట.
2. డయాబెటిస్:
డయాబెటిస్ ఉన్నవారు తేనెకు చాలా దూరంగా ఉండాలి.. ఎందుకంటే ఇది గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. డయాబెటిస్ స్థాయిలను పెంచుతుంది కాబట్టి తేనెకు దూరంగా ఉండడమే సరైన పద్ధతి.
3. అధిక రక్తపోటు:
రక్తపోటును అధికం చేయడంలో తేనె మొదటి పాత్ర వహిస్తుంది. అయితే తక్కువ పరిమాణంలో తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు ఎక్కువగా తినడం వల్ల ఇలాంటి సమస్య ఎక్కువ అవుతుంది.
4. జీర్ణ సమస్యలు:
తేనే ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువ అవడంతో పాటు డయేరియా , కడుపునొప్పి వంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
5. గొంతు పట్టేయడం:
తేనె ఎక్కువగా తినడం వల్ల ఒకసారి గొంతు రాసినట్టు.. గొంతు పట్టేసినట్టు అనిపిస్తుంది. మాట్లాడటంలో ఇబ్బంది కలుగుతుంది.
6. దంతక్షయం:
తేనె ఎక్కువగా తినడం వల్ల పంటిల్లో అధిక బ్యాక్టీరియా పేరుకుపోయి .. నోటి నుండి దుర్వాసన కూడా వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: