గుండె పోటుకి అసలైన కారణాలు ఏంటో తెలుసా?

Purushottham Vinay
ఇక ఈ రోజుల్లో చాలా మంది మనుషులకు పెరుగుతున్న మానసిక ఒత్తిడి కారణంగా మెదడు అనేక రకాల హార్మోన్లను విడుదల చేయడం అనేది ప్రారంభిస్తుంది. దీంతో శరీరంలో బీపీ ఎక్కువగా పెరుగుతుంది. ఇలా పదే పదే జరిగినప్పుడు గుండె ధమనులు ఉబ్బడం అనేవి ప్రారంభిస్తాయి. చాలా కాలంగా ఈ సమస్య కారణంగా ధమనులలో రక్తం గడ్డకట్టడం అనేది జరుగుతుంది. దానివల్ల గుండెపోటు సమస్య వస్తుంది. నేటి కాలంలో ప్రజలు వివిధ కారణాల వల్ల బాగా ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో వారికి గుండె సంబంధిత వ్యాధులు అనేవి వస్తున్నాయి. ప్రజలు వారి శారీరక దృఢత్వంపై శ్రద్ధ చూపుతారు కానీ మానసిక ఆరోగ్యాన్ని మాత్రం విస్మరిస్తారు.జన్యుపరమైన కారణాల వల్ల కూడా గుండెపోటు వస్తుందని చాలా మంది వైద్యులు చెబుతున్నారు. అంటే కుటుంబంలో ఎవరికైనా ఇంతకు ముందు గుండె జబ్బు కనుక ఉంటే అది ఖచ్చితంగా రెండో తరానికి చేరుతుంది.


ఇక ఈ సమస్య ఎవరి అదుపులో ఉండదు. ఎందుకంటే జన్యుపరమైన కారణాల వల్ల ఒక వ్యక్తి ఈ వ్యాధికి గురవుతాడు కాబట్టి. వైద్యుల ప్రకారం.. హైపర్ కొలెస్టెరోలేమియా అనేది చిన్న వయస్సులోనే కొంతమందిలో ఉండే జన్యుపరమైన వ్యాధి అట. దీని కారణంగా చిన్న వయస్సులోనే LDL కొలెస్ట్రాల్ అనేది పెరగడం ప్రారంభమవుతుంది. ఇక దీని కారణంగా గుండెపోటు ప్రమాదం అనేది ఉంటుంది.ఇక తగిన జాగ్రత్తల కోసం ఆహారంలో తక్కువ నూనె వాడాలి. రోజూ కనీసం అరగంట పాటు సైక్లింగ్ ఇంకా అలాగే జాగింగ్ లేదా ఏదైనా వ్యాయామం చేయాలి. పొగాకు ఇంకా అలాగే మద్యపానానికి దూరంగా ఉండాలి. ఆరు నుంచి ఎనిమిది నెలలకు ఒకసారి గుండె పరీక్షని ఖచ్చితంగా చేయించుకోవాలి.అసలు ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలి. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు యోగా ఇంకా అలాగే మెడిటేషన్‌ ద్వారా కంట్రోల్‌ చేయాలి. ఇక అలాగే వీటన్నింటితో పాటు తగినంత నిద్ర పోవడం అనేది కూడా చాలా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: