వామ్మో.. ఎనిమిది గంటల్లో.. అమ్మాయి అబ్బాయిగా మారింది?

praveen
ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. దీంతో మనిషి ఏదైనా అనుకున్నాడు అంటే చాలు అది ఎంతో సులభంగా చేయడానికి వీలు కూడా ఉంది. ఈ క్రమంలోనే కొంతమంది చిత్రవిచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో అబ్బాయిలు అమ్మాయిలు గా.. అమ్మాయిలు అబ్బాయిలు గా మారిపోవటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇలా మారటానికి  నేటి రోజులలో జనాలు ఎంతగానో ఇష్టపడి పోతున్నారు. దీనికోసం  చికిత్స చేసుకోవడానికి సిద్ధం  అవుతున్నారు.


 ఇక ఇటీవల బీహార్ జిల్లా మథుర ఉప జిల్లాలోని బహు రాపర్తి గ్రామంలో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతంలో నివసిస్తున్న బాలిక గుడియా కుమారి వైద్యశాస్త్రం సహాయంతో లింగ మార్పిడి చేయించుకుంది. ఇక గుడియా కుమారి కాస్త రుద్రాక్ష గా మారిపోయింది. పుట్టుకతోనే అమ్మాయిగా జన్మించాడు అతను. ఆ తర్వాత స్పృహ వచ్చినప్పటి నుంచి అమ్మాయిల కంటే అబ్బాయిలతో ఎక్కువగా స్నేహం చేస్తూ వస్తున్నాడు   అయితే అమ్మాయిలతో కంటే అబ్బాయితో స్నేహం చేస్తే బాగుంది అంటూ అతనికి అనిపించింది. ఇక కేవలం స్నేహం మాత్రమే కాదు అచ్చం అబ్బాయిల మాదిరిగానే ప్యాంటు షర్టు లు వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడే వాడు. అంతేకాకుండా మోటార్ సైకిళ్ళు కూడా నడిపేవాడు.



 చివరికి ఓ రోజు అమ్మాయి గా ఉండడం ఎందుకు ఇక పూర్తిగా అబ్బాయిగా మారి పోతే సరిపోతుంది కదా అని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే డిసెంబర్ 27, 2021న ఢిల్లీలో లింగమార్పిడి కి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. కేవలం ఎనిమిది గంటల వ్యవధిలోనే ఇక లింగ మార్పిడి జరిగి అమ్మాయి కాస్త అబ్బాయి గా మారిపోయింది. ఇక ప్రతినెలా హార్మోన్లు అతని బాడీ లోకి ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇది రెండు సంవత్సరాల వరకూ ఇలాగే చేస్తూ ఉండాలి. ఇక అప్పుడే ఆమె పూర్తిగా అబ్బాయి గా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే గుడియా నుంచి రుద్రాక్షి వరకు ప్రయాణం సులభంగా లేదని చెబుతోంది అబ్బాయి గా మారిన అమ్మాయి. తన కోరిక మేరకు కుటుంబ సభ్యులు నుంచి ఆమోదం పొందడానికి కూడా చాలా సమయం పట్టింది అంటూ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: